ఈపీఎఫ్ఓ తీసుకున్న5 కొత్త నిర్ణ‌యాలు

ఈపీఎఫ్ఓ చందాదారుల సౌల‌భ్యం కోసం ఇటీవలే స‌రికొత్త విధానాలు అమ‌ల్లోకి తీసుకొచ్చింది

ఈపీఎఫ్ఓ తీసుకున్న5 కొత్త నిర్ణ‌యాలు

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ‌(ఈపీఎఫ్ఓ) చందాదారులు మ‌రితం సుల‌భంగా క్లెయిలంను ప‌రిష్క‌రించుకునేందుకు ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టింది. వాటిలో తాజాగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను క్లుప్తంగా తెలుసుకుందాం.

1.ఈపీఎఫ్ఓ పాస్‌బుక్

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పింఛ‌నుదారుల‌కు మ‌రిన్ని కొత్త సేవ‌ల‌ను ప్రారంభించింది. పింఛ‌నుదారులు ఇప్పుడు త‌మ‌ పాస్‌బుక్‌ని ఆన్‌లైన్ ద్వారా చూసుకోవ‌చ్చు. ఉమంగ్ యాప్‌లో పీపీఓ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసిన త‌ర్వాత‌ ‘వ్యూ పాస్‌బుక్’ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌ర్వాత మీరు న‌మోదు చేసుకున్న ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత పాస్‌బుక్‌తో పాటు మీ పుట్టిన తేదీ, పేరు, చివ‌రిగా క్రెడిట్ అయిన పెన్ష‌న్ వంటి వివ‌రాలు తెర మీద క‌న‌బ‌డ‌తాయి. అవ‌స‌ర‌మ‌నుకుంటే పాస్‌బుక్ వివ‌రాల‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంది.

2. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌

ఈపీఎఫ్ఓ చందాదారులు https://mis.epfindia.gov.in/PensionPaymentEnquiry ద్వారా త‌మ పీఎఫ్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ నెంబ‌ర్‌, జీవ‌న ప‌త్రం స‌మ‌ర్పించేందుకు, పాస్‌బుక్‌, చందాదారుడి వివ‌రాలు, జ‌మ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ జీవ‌న ప‌త్రం తిర‌స్క‌రించ‌బ‌డితే దాని స్టేట‌స్ తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది.

3. డిపాజిట్ గురించిన‌ స‌మాచారం

ఈపీఎఫ్ఓ ఇక‌నుంచి ఖాతాలో నగ‌దు డిపాజిట్ చేసినా చేయ‌క‌పోయినా ఉద్యోగుల‌కు స‌మాచారం అందించ‌నుంది. మీరు పనిచేస్తున్న సంస్థ యజమాని వారి పీఎఫ్ వాటాను గడువు తేదీలోగా మీ ఖాతాలో జమ చేయకపోతే వెంటనే ఉద్యోగుల‌కు తెలియ‌జేసేలా నిర్ణ‌యం తీసుకుంది.
ప్రస్తుతం, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ ) మాత్రమే ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తున్న మొత్తానికి సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్/ ఈ మెయిల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్ ) ఉన్న వారికి తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ విధానాన్ని సంస్థ యజమానులు కూడా అవలంబించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది.

4. పీఎఫ్ వాటాను పెంచుకోవ‌చ్చు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌(ఈటీఎఫ్‌)లో పెట్టుబ‌డుల‌కు సంబంధించిన స్వ‌యం నిర్ణ‌యాధికారాన్ని ఉద్యోగుల‌కే ఇచ్చేందుకు ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది. ఈ నిర్ణ‌యం దాదాపు 5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారుల‌పై ప్ర‌భావం చూప‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డుల ద్వారా వ‌చ్చిన యూనిట్ల‌ను మూడు నెలల్లో సంస్థ ఉద్యోగుల ఖాతాలో వేయ‌నుంది. ఆ త‌ర్వాత ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులను పెంచుకోవాలా వ‌ద్దా అన్న నిర్ణ‌యం ఉద్యోగుల‌కే వ‌దిలేయ‌నుంది.

5. ఇ-నామినేష‌న్ స‌దుపాయం

ప్ర‌భుత్వం డిజిట‌ల్ విధానంలో భాగంగా , ఈపీఎఫ్ఓ ఇ-నామినేష‌న్ విధానాన్ని ప్రారంభించింది. ఇది https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లో చేసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ఓ చందాదారుల‌కి అంద‌రికీ ఈ స‌దుపాయం ఉంటుంది. నామినేష‌న్ ఫార‌మ్ డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌తో ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly