ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ప్ర‌తీ ఏటా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు రోజు భార‌త దేశ ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నివేదిస్తారు.

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

గడిచిన ఏడాదిలో దేశంలో జ‌రిగిని ఆర్థిక అభివృద్ధి, ప్ర‌భుత్వ విధానాల ఫ‌లితాలు వంటివి తెలిపేదే ఆర్థిక‌స‌ర్వే. దీని ఆధారంగా బ‌డ్జెట్ లో చ‌ర్చించాల్సిన‌ అంశాలపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. పార్ల‌మెంట్‌లో యూనియ‌న్ బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టబోయే ఒక‌రోజు ముందు ఆర్థిక మంత్రికి అంద‌జేస్తారు. ఈ నివేదిక ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌ధాన ఆర్థిక స‌ల‌హాదారుడు త‌యారుచేస్తారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ తీరుతెన్నుల‌ను ఈ నివేదిక స్ప‌ష్టంగా వెల్ల‌డిస్తుంది. ఈ ఏడాది ఈ స‌ర్వేను కొత్త ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు క్రిష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణ్యం జులై 4 న స‌మ‌ర్పించ‌నున్నారు.

దీని ద్వారా పాల‌సీ ప‌రంగా ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు, ప్ర‌స్తుతం ఉన్న దేశ ఆర్థిక స్థితిగ‌తుల‌ను తెలుపుతుంది. ఈ స‌ర్వే ఆధారంగా ప్ర‌భుత్వం ఇంకా చేయాల్సిన అభివృద్ధి ప‌నులు ఏంటి? గ‌త ఏడాది అభివృద్ధి ఎంత మేర‌కు జ‌రిగింది అనే విష‌యాలు వివ‌రంగా తెలుస్తాయి. గ‌డిచిన 12 నెల‌ల్లో దేశంలో జ‌రిగిన అభివృద్ధి గురించి ఇందులో ప్రస్తావిస్తారు. ఇది ప్ర‌ధానంగా అభివృద్ధి కార్యక్రమాల పనితీరు , ఫ‌లితాలు ప్రభుత్వ విధానాలు, స్వల్ప నుంచి మ‌ధ్య‌కాలికానికి ఆర్థిక వ్యవస్థలో వ‌చ్చిన మార్పుల‌ను తెలియ‌జేస్తుంది.

2019-20 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి ఆర్థిక సర్వేలో రైతుల‌కు, వ్య‌వ‌సాయానికి సంబంధించి కొన్ని కొత్త ప్రతిపాద‌న‌లు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఆహార ఉత్ప‌త్తుల‌కు మ‌ద్ద‌తు ధ‌రలు, ఆదాయం, రుణాలు, ర‌వాణా స‌దుపాయాల లోటు వంటివి ప‌రిశీలన‌లోకి తీసుకురానున్నారు.

2018 లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే స్ర్తీ-పురుష స‌మాన‌త్వ‌ సమస్యలపై ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చేలా పింక్ రంగులో ఉంది. లింగ సమానత్వం లేక‌పోవ‌డం అనేది అంతర్గత స‌మ‌స్య‌గా మారింద‌నేది దీని ప్ర‌ధాన ఉద్దేశం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly