రుణాల‌పై మాంద్యం ప్ర‌భావం

రిక‌వ‌రీ ద‌శ‌లోకి వెళ్లిన రెండు ల‌క్ష‌ల రుణాల‌ను క్రెడిమేట్ స‌ర్వే విశ్లేషించింది

రుణాల‌పై మాంద్యం ప్ర‌భావం

వేత‌నాల ఆల‌స్యం, వ్యాపారంలో న‌ష్టం వ‌ల‌న చాలామంది రుణాలు చెల్లించ‌లేక‌పోతున్నార‌ని ఒక స‌ర్వే నివేదిక వెల్ల‌డించింది. పేటీఎం భాగ‌స్వామిగా ఉన్న ఆర్థిక సాంకేతిక సేవ‌ల సంస్థ ‘క్రెడిమేట్’ కంపెనీ చేసిన స‌ర్వే ప్ర‌కారం 36 శాతం మంది వేత‌నాలు ఆల‌స్యంగా రావ‌డం కార‌ణంగా రుణాలు చెల్లించ‌లేక‌పోయామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత 29 శాతం మంది వ్యాపారంలో న‌ష్టం కార‌ణంగా స‌మ‌యానికి రుణాలు చెల్లించలేద‌ని వాపోయారు.

ఆరు న‌గ‌రాల్లో రెండు ల‌క్ష‌ల రుణాల‌పై ‘క్రెడిమేట్’ విశ్లేష‌ణ చేసింది. వాహ‌న‌, వ్య‌క్తిగ‌త‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌లు, విద్యారుణాలు, ఆరోగ్య చికిత్స‌న‌, డిజిట‌ల్ రుణాల గురించి ఆరా తీసింది. ఉద్యోగాల కోత‌, వేత‌నాల ఆల‌స్యం ప్ర‌ధాన కార‌ణంగా క‌న‌బ‌డుతోంద‌ని స‌ర్వే నివేదిక తెలిపింది. దీంతో సామాన్య ప్ర‌జ‌ల బ‌డ్జెట్‌పై నేరుగా ప్ర‌భావం చూప‌డంతో ఈ ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. గ‌రిష్ఠంగా రెండు లేదా మూడు నెల‌ల‌కు స‌రిప‌డా ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే పొదుపు చేసుకున్నారు. ఇప్పుడు ఆల‌స్య‌మైన వేత‌నాల కంటే ఉద్యోగాల‌ను కాపాడుకోవ‌డం పైనే వారు దృష్టి వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్థిక మాంద్యం ప్ర‌భావం ఉద్యోగాల‌పై ప‌డుతోంది, దీంతో రుణాలు తిరిగి చెల్లించ‌లేని పరిస్థిలు ఎదుర‌వుతున్నాయి. రుణాలు చెల్లించ‌లేని వారిలో ఎక్కువ‌గా భోపాల్‌, చెన్నై, బెంగ‌ళూరు, దిల్లీ, పుణె న‌గ‌రాల్లో ఉన్నారు. ఇక 82 శాతం మ‌గ‌వారు రుణ చెల్లింపుల్లో ఆల‌స్యం చేస్తుంటే, 18 శాతం మ‌హిళ‌లు ఉన్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారు, రుణాలు తీసుకునేవారి సంఖ్య‌లో పురుషులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వారే ఎక్కువ‌గా బ‌కాయిలు ప‌డిన‌ట్లు తెలిపింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly