స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెట్టుబడికి సరైన స‌మ‌యమేనా?

ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ స్మార్ట్ ట్రిగ్గర్-ఎనేబుల్ ప్లాన్ (స్టెప్) తో మ‌దుప‌ర్లు మార్కెట్ క్షీణించిన స‌మయంలో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు

స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెట్టుబడికి సరైన స‌మ‌యమేనా?

ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్, స్మార్ట్ ట్రిగ్గర్-ఎనేబుల్ ప్లాన్ (స్టెప్) ను ఒక అదనపు ఫీచర్ తో ఒక స్మాల్ క్యాప్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ ను ప్రారంభించింది. పేరు సూచిస్తున్నట్లుగా, ఈ ఫండ్ మార్కెట్ లో ఉన్న స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెట్టుబడి పెట్టబడుతుంది. స్టెప్ విధానంతో మ‌దుప‌ర్లు తమ పెట్టుబడులను అప్ర‌మ‌త్తంగా నిర్వ‌హించ‌డానికి, టైమింగ్ రిస్క్ ల‌ను తగ్గించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్ కాప్ కంపెనీలలో కనీసం 65% పెట్టుబడి చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 250 వ ర్యాంకు కింద ఉన్న కంపెనీలు. ఈ నిధి 35% వరకు లార్జ్ , మిడ్ క్యాప్ కంపెనీలు లేదా డెట్, ద్రవ్య మార్కెట్ సాధనాల్లో పెట్టుబ‌డి చేస్తుంది. స్టెప్ విధానం ద్వారా మార్కెట్ క్షీణించిన స‌మ‌యంలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. పెట్టుబడి ఐదు వాయిదాలలో ఫండ్ లోకి వెళ్తుంది. మొదటి 20% అప్లికేషన్ మొత్తం స్మాల్ క్యాప్ ఫండ్ లోకి పెట్టుబడి గా జ‌మ‌వుతుంది. మిగిలిన 80% ఎడెల్వీస్ లిక్విడ్ ఫండ్లో పెట్టుబడి లోకి వెళ్తుంది. స్మాల్ క్యాప్ సూచీలోలో 3% క్షీణత ఏర్ప‌డిన పుడు ట్రిగ్గర్ అయి ప్ర‌తీ నెలా లిక్విడ్ ఫండ్ నుంచి స్మాల్ క్యాప్ ఫండ్ లోకి పెట్టుబ‌డి బదిలీ అవుతుంది. ఒక వేళ ట్రిగ్గర్ హిట్ కాకపోతే, ఆ నెల చివరి వ్యాపార రోజున కేటాయింపు జరుగుతుంది. ఇండెక్స్ 3% కంటే త‌క్కువగా ఉన్నా పెట్టుబ‌డి బదిలీ నెలకు ఒక‌టి కి మాత్ర‌మే పరిమితం అవుతుంది.

పెట్టుబడిదారులు ఏ సమయంలోనైనా స్మాల్ క్యాప్ ఫండ్ కు లిక్విడ్ ఫండ్ నుంచి కొంత భాగాన్ని బదిలీ చేసుకును ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు కావాల‌నుకుంటే ఎన్ఎఫ్ఓ ద్వారా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి చేయవచ్చు. పెట్టుబ‌డి మొత్తం కేటాయింపు రోజున ఫండ్ లో ఒకే ద‌ఫాలో పెట్టుబడి అయ్యేలా ఆప్ష‌న్ ఉంటుంది. లేదా సిప్ ద్వారా పెట్టుబడి చేయవచ్చు. అయితే, ఈ ఎంపికల ద్వారా , మార్కెట్ క్షీణించినప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్లోకి పెట్టుబడులు పెట్టడానికి ట్రిగ్గర్ ప్రయోజనం ఉండదు.

గతంలోలా కాకుండా, ప్ర‌స్తుతం ఫండ్ హౌసెస్ మార్కెట్లో లేదా సెగ్మెంట్లో ఉండే అవ‌కాశాలను అందుకుని ప్రయోజనాన్ని పొందటానికి కొత్త ఫండ్ ఆఫ‌ర్ ల‌తో ముందుకొస్తున్నాయి. ప్ర‌స్తుతం స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో దిద్దుబాటు జ‌రిగింది. ఈ త‌రుణంలో వీటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మంచి రాబ‌డిని పొందొచ్చ‌నే ఉద్దేశంతో ఈ కేట‌గిరీలో ఫండ్ల‌ను ఏఎమ్‌సీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నిఫ్టీ స్మాల్ కాప్ 100 ఇండెక్స్ 2018 లో 29% న‌ష్ట‌పోయింది. స్మాల్ క్యాప్ ఫండ్లలో అస్థిరత అధికంగా ఉంటుంది. ఈ కేటగిరీలో ఒక సంవత్సరం రాబ‌డి -21.71% 3, 5, 10 సంవత్సరాల రాబ‌డి వరుసగా 10.92%, 21.38%, 20.47% గా న‌మోదైంది.

స్మాల్ క్యాప్ విభాగంలో గణనీయమైన దిద్దుబాటు కనిపించింది. అయితే ఈ కేట‌గిరీలో అన్ని కంపెనీలు అనుకూల‌మ‌ని చెప్ప‌లేం. బలమైన కంపెనీలు ప్ర‌స్తుతం ఆకర్షణీయంగా ఉన్న‌య‌ని చెప్ప‌వచ్చు. రాబ‌డి విష‌యంలో ఈ కేట‌గిరీకి లార్జ్ , మిడ్ క్యాప్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ , మార్కెట్ పరిస్థితులు అననుకూలంగా మారినప్పుడు అదే స్థాయిలో ప‌త‌న‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

మీ ఆస్తి కేటాయింపులు, న‌ష్ట‌భ‌యం ప‌రిశీలించి ఎన్ఎఫ్ఓ లో పెట్టుబడి పెట్టాలి. స్టెప్ సౌకర్యం సిప్ విధానాన్ని మ‌రింత‌ మెరుగుపరుస్తుంది. పెట్టుబడిదారులు మరింత సమర్థవంతంగా స్టాక్స్ ధరలలో ఏదైనా దిద్దుబాటు నుంచి ప్రయోజనం చేకూర్చడానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఫండ్ వ్యవస్థాత్మక బదిలీ మార్గం ద్వారా అస్థిరతని స‌ర్దుబాటు అధిగ‌మించేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. కానీ 3 సంవత్సరాల లోపు మీ పెట్టుబడిని వెన‌క్కు తీసుకోవాల‌నుకుంటే ఈ ఫండ్ అనుకూలం కాదు. స్మాల్ క్యాప్ కంపెనీలు అధిక న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటాయి. స్వ‌ల్ప కాలంలో వీటి రాబ‌డిపై అస్థిత‌ర ప్ర‌భావం అధికంగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly