ఎడిల్‌వీజ్ వెల్త్ అల్టిమా ప్లాన్‌

ఎడిల్ వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ వినియోగ‌దారుల సంప‌ద వృద్ధి,జీవిత బీమా కోసం వెల్త్ అల్టిమా పేరుతో ఒక కొత్త యూనిట్ ఆధారిత జీవిత బీమా ప‌థ‌కం(యూలిప్‌) ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

ఎడిల్‌వీజ్  వెల్త్ అల్టిమా ప్లాన్‌

ప్రైవేట్ బీమా సంస్థ ఎడిల్‌వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి కొత్త‌గా యూనిట్ ఆధారిత జీవిత బీమా ప‌థ‌కం(యూలిప్‌) వెల్త్ అల్టిమా ప్లాన్ ను విడుద‌ల చేసింది. దీనిలో అనేక స‌దుపాయాలున్నాయి. సొమ్ము మొత్తాన్ని పెంచేందుకు క్ర‌మానుగ‌త నెల‌వారీ ప‌థ‌కం(ఎస్ఎమ్‌పీ),ర‌క్ష‌ణ కోసం క్ర‌మానుగ‌త బ‌దిలీ ప‌థ‌కం(ఎస్‌టీపీ),అవ‌స‌రమైన‌ప్పుడు సొమ్మును వాడుకునేందుకు క్ర‌మానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ ప‌థ‌కం(ఎస్‌డ‌బ్ల్యూపీ) వంటివి క‌లిసి ఉన్నాయి. వినియోగ‌దారుల అభిరుచి మేర‌కు దీర్గ‌కాలంలో సంప‌ద వృద్ధికి,జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుక‌ల‌ను ఎదుర్కొనేందుకు ఈ కొత్త ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కంపెనీ తెలిపింది.

ఈ ప‌థ‌కంలో వినియోగ‌దారుల సంప‌ద వృద్ధి చెంద‌డానికి,ఖ‌ర్చు త‌గ్గేందుకు మూడు ర‌కాల అద‌న‌పు సౌక‌ర్యాలున్నాయి. స‌క్ర‌మంగా ప్రీమియం చెల్లించే వారికి రివార్డ్ పాయింట్లు ఇస్తారు. దీర్ఘకాలం మ‌దుపు చేసిన వారికి అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇందులో మ‌రో అద‌న‌పు సౌక‌ర్యం ఉంది. ఒక వేళ పాల‌సీదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే,అత‌ని త‌ద‌నంత‌రం,పాల‌సీ కొన‌సాగ‌డంతో పాటు,అత‌ని పిల్ల‌ల‌కు పాల‌సీ ప్ర‌యోజ‌నాలు ద‌క్కుతాయి. అలాగే ఆదాయ ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం ప‌న్ను మిన‌హ‌యింపు సైతం ఉంటుంది. ఎడిల్‌వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్‌ అనేది ఎడీల్‌వీజ్ గ్రూప్‌,జ‌పాన్‌కి చెందిన టోక్యో మెరైన్ హోల్డింగ్స్ ల సంయుక్త సంస్థ‌.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly