50/30/20 రూల్ గురించి తెలుసా?

ఎలిజెబెత్ వారెన్ ప్ర‌తిపాదించిన "50/30/20 రూల్ " అవ‌స‌రాలకు 50 శాతం, కోరిక‌ల‌కు 30 శాతం, పొదుపు 20 శాతం.

50/30/20 రూల్  గురించి తెలుసా?

మ‌నం చేసే ఖ‌ర్చుల‌కు సంబంధించి బ‌డ్జెట్ వేసుకుంటే ఎంత ఖ‌ర్చ‌వుతుంది… ఎంత పొదుపు చేస్తున్నాం… త‌దిత‌ర వివ‌రాల‌న్నీ తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తీ నెలా ఇంటి ఖ‌ర్చులు ఎంత? ప‌ద‌వీవిర‌మ‌ణ నిధికి ఎంత వెన‌కేస్తున్నాం, అత్య‌వ‌స‌ర‌నిధి కోసం ఎంత పొదుపు చేస్తున్నాం అనేది లెక్క వేసుకోవాలి. 50/30/20 కుటుంబ బ‌డ్జెట్ నియ‌మం. ఎలిజెబెత్ వారెన్ ప్ర‌తిపాదించిన "50/30/20 రూల్ " ఈ నియమం ప్ర‌కారం ప‌న్ను చెల్లించాక మిగిలే ఆదాయాన్ని నిక‌ర ఆదాయంగా ప‌రిగ‌ణించి ఆ మొత్త‌న్ని మూడు భాగాలుగా విభ‌జించి ప్ర‌ణాళిక వేసుకోవాలి.

50 శాతం అవ‌స‌రాలకు - ఈ నియమం ప్ర‌కారం 50 శాతం మ‌న అవ‌స‌రాల‌కు వినియోగించుకోవాలి. అవ‌స‌రాలంటే మ‌న జీవించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఇళ్లు, తిండి, బ‌ట్ట‌లు మొద‌లైన‌వి. ఇంటిరుణానికి చెల్లించే ఈఎమ్ఐలు, వాహ‌న‌, బీమా, విద్య‌, ఆరోగ్య సంబంధిత ఖ‌ర్చులు ఇందులో వ‌స్తాయి. 30 శాతం కోరిక‌ల‌కు - ఇవి జీవించేందుకు త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాల కింద రావు. విహార‌యాత్ర‌లు, ఎంట‌ర‌టైన్ మెంట్, సినిమాలు, ఆట‌లుపాట‌లు ఇవ‌న్నీ ఈ కేట‌గిరీలోకి వ‌స్తాయి. సాధార‌ణంగా చూసే టీవీ షోలు మాత్ర‌మేకాకుండా ప్రీమియం షోలు, కొత్త గాడ్జెట్ లు, ఖ‌రీదైన కారు మొద‌లైన అంశాలు. 20 శాతం పొదుపు - మీరు సంపాదించిన మొత్తంలో పొదుపు, పెట్టుబ‌డుల కోసం కేటాయించే మొత్తం. అత్య‌వ‌స‌ర‌నిధి, పొదుపుఖాతాలో డ‌బ్బు, మ్యూచువ‌ల్ ఫండ్లు మొద‌లైన‌వి. ముందుగా తీర్చేసే రుణాల‌ను కూడా పొదుపు లో భాగంగా చేసుకోవ‌చ్చు. స‌మయానుగుణంగా చెల్లించేవి అవ‌స‌రాల్లోకి వ‌స్తే ముందుగా రుణభారాన్ని త‌గ్గించుకునే ఉద్దేశంతో చెల్లించే వాటిని పొదుపుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఒక వ్య‌క్తి నెల‌కు 40 వేలు నిక‌ర ఆదాయం పొందితే అందులో కుటుంబ ఖ‌ర్చులు, బీమా, వైద్యం, ఇంటి అద్దె, గృహ‌రుణం వాయిదా త‌దిత‌ర ఖ‌ర్చుల‌న్నీ 50 శాతం అంటే 20 వేలు లోపు ఉండేలా చూసుకోవాలి. అనంత‌రం ఇత‌ర అవ‌స‌రాల‌కు, కోరిక‌లకు 12 వేలు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. వీటిలో వాహ‌న, విహారయాత్ర‌లు మొద‌లైన ఇత‌ర‌ ఖ‌ర్చుల‌ను చేయ‌వ‌చ్చు. ఇంకా 20 శాతం పొదుపు అంటే 8 వేలు చేయ‌వ‌చ్చు. దీంతో మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు త‌దిత‌ర పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. ఎలిజెబెత్ వారెన్ All Your Worth: The Ultimate Lifetime Money Plan అనే పుస్త‌కంలో ఈ నియ‌మం గురించి తెలియ‌చేశారు. ఈ నియమం అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేం. వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ప్ర‌ణాళిక‌ను వేసుకోవాలి. వీలైతే ఆర్థికప్ర‌ణాళిక కోసం స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. మీరు దీన్ని పాటించడానికి ప్రయత్నిస్తే మీ ఆర్ధిక జీవితం సజావుగా సాగుతుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly