ర‌క్ష‌ణ రంగంలో పెట్టుబ‌డులకు ప్రోత్సాహ‌కాలు : అరుణ్ జైట్లీ

ర‌క్ష‌ణ రంగంలో పెట్టుబ‌డుల‌కు అవ‌స‌ర‌మైన ప్రోత్సాహ‌కాలు అందించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొంది.

ర‌క్ష‌ణ రంగంలో పెట్టుబ‌డులకు ప్రోత్సాహ‌కాలు : అరుణ్ జైట్లీ

ర‌క్ష‌ణ రంగంలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించి, దేశీగా త‌యారీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు కేంద్ర ఆర్థిక‌, ర‌క్ష‌ణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇత‌ర దేశాల‌నుంచి దిగుమ‌తుల‌ను త‌గ్గించి స్థానికంగా ర‌క్ష‌ణ రంగానికి అవ‌స‌ర‌మైన సామాగ్రిని త‌యారు చేసేందుకు అనువైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

దీనికి సంబంధించిన ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ కంపెనీల‌లో విదేశీ పెట్టుబ‌డుల నిబంధ‌న‌ల‌ను కూడా స‌వ‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే భార‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌కు సంబంధించి అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించిన‌ట్లు తెలిపారు. భార‌త ర‌క్ష‌ణ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇదే అనువైన స‌మ‌య‌మ‌ని ఆయ‌న సూచించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly