న్యూ లైట్ పోర్ట‌ల్‌తో సుల‌భంగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రాల‌నికి గానూ ఐటీర్ దాఖలు చేసేందుకు ఆగ‌ష్టు 31 వ‌ర‌కు గ‌డువు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది

న్యూ లైట్ పోర్ట‌ల్‌తో సుల‌భంగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు

ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) స్వయంగా దాఖలు చేయడం క్లిష్ట‌మైన ప‌ని. ఇందుకు ప‌ట్టే సమయం కూడా ఎక్కువే. ఆదాయ‌పు రిట‌ర్నుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేసేందుకు వీలుగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త లైట‌ర్ ప‌ద్ధ‌తిని త‌మ ఇ-ఫైల్లింగ్ వెబ్‌సైట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ‘ఇ-ఫైలింగ్ లైట్’ పోర్టల్‌ను, ప్రధాన ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారానే పొందవచ్చు.

ఐటీఆర్‌ను ఇ-ఫైలింగ్‌తో పాటు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో మరే ఇతర కార్యకలాపాలు చేయని పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడుతుంది. ఆగస్టు 1 నుండి, ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో నమోదైన వినియోగదారులందరికీ ఇ-ఫైలింగ్ సదుపాయాన్ని పొందేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. 1. స్టాండ‌ర్డ్ విధానం: వివిధ ర‌కాల ఆప్ష‌న్‌తో ప్రాసెస్ ఎక్కువ‌గా ఉంటుంది. 2. లైట్ వెర్ష‌న్‌, ఇది కేవ‌లం ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మాత్ర‌మే ఉద్దేశించిన‌ది.

ప‌న్ను చెల్లింపుదారులు ఐటీర్‌ను ఫైల్ చేసేందుకు ఈ రెండు స‌దుపాయ‌ల‌లో దేనినైనా వినియోగించుకోవ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇ-ఫైల్లింగ్ వెబ్‌సైట్‌- హోమ్ పేజ్‌లో ఎడ‌మ వైపు ఈ ఆప్ష‌న్ ‘క్విక్ ఐటీఆర్ ఫైలింగ్’ పేరుతో అందుబాటులో ఉంచింది. ఈ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా ‘లైట్’ పోర్టల్‌కు చేరుకోవ‌చ్చు.

itr.jpg

‘లైట్’ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో, మీరు ఐటీఆర్‌ను ఫైల్ చేసి, దాని ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు, ప్రీ-ఫిల్ ఎక్స్‌ఎంఎల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ద్వారా, ఫారం 26 ఎఎస్ (డిడ‌క్ట్ అయిన‌ మూలం వ‌ద్ద ప‌న్ను కోసం), ఇ-ఫైల్ చేసిన‌ ఆదాయపు పన్ను రిటర్న్‌లను తనిఖీ చేయోచ్చు. (ఎక్స్‌ఎంఎల్/ ఐటీఆర్‌/ ఐటీఆర్‌-వీ ఆప్ష‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోన‌వస‌రం లేదు).

ఇ-ప్రొసీడింగ్‌, ఇ-నివార‌న్‌, కంప్లెన్స్‌, వ‌ర్క్‌లిస్ట్‌, ఫ్రొఫైల్ సెట్టింగ్స్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల కోసం ఇ-ఫైల్లింగ్ హోమ్ పేజ్‌లోని “పోర్టల్ లాగిన్” బ‌ట‌న్‌పై క్లిక్ చేయ‌డం ద్వారా పూర్తి వెర్ష‌న్‌కు వెళ్ళ‌వ‌ల‌సి ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప‌న్ను చెల్లింపుదారులు సుల‌భంగా, త్వ‌రితంగా ఐటీర్‌ను ఫైల్ చేసేందుకు ‘లైట్’ వెర్షన్ ప్రారంభించారు. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రాల‌నికి గానూ ఐటీర్ దాఖలు చేసేందుకు ఆగ‌ష్టు 31 వ‌ర‌కు గ‌డువు తేదీని ప్ర‌భుత్వం పొడిగించింది.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly