రిస్క్‌ను క్ర‌మంగా త‌గ్గించుకోండి

ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మీప కాలంలో ఉన్న‌ప్పుడు వీలైనంత వ‌ర‌కు రిస్క్ త‌గ్గించుకొని డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులను పెంచుకోవాలి.

రిస్క్‌ను క్ర‌మంగా త‌గ్గించుకోండి

2016 లో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఒక వ్య‌క్తి అత‌ను అప్ప‌టివ‌ర‌కు పొదుపు చేసిన దాంట్లో చాలావ‌ర‌కు స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకున్నాడు. స్టాక్ పెట్టుబ‌డుల గురించి తెలుసుకునేందుకు ఒక చిన్న‌ కోర్సులో కూడా చేరాడు. ఎప్పుడైతే పెట్టుబ‌డులు చేయ‌డం ప్రారంభించాడో అప్పుడు డ‌బ్బు న‌ష్ట‌పోతున్నాడ‌న్న విష‌యం అర్థం చేసుకున్నాడు. దీంతో ఆర్థిక నిపుణుల‌ను సంప్ర‌దించాడు. పెట్టుబ‌డుల గురించి ఉన్న‌ అవ‌గాహ‌న పూర్తిగా ప్ర‌తికూలంగా ఉందన్న విష‌యం ఆర్థిక స‌ల‌హాదారుడికి అర్థ‌మైంది. అత‌డి భార్య కూడా మంచి ఉద్యోగంలో ఉంది . అయితే ఆమెకు మార్కెట్‌కు సంబంధించిన పెట్టుబ‌డుల‌పై న‌మ్మ‌కం లేదు. త‌మ డ‌బ్బు బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే భ‌ద్రంగా ఉంటుంద‌ని న‌మ్ముతుంది. రిస్క్ ఎక్కువ‌గా తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌దు. అయితే వారిరి ఆర్థిక నిపుణులు ఈక్విటీల్లో 50 శాతం డెట్ ఫండ్ల‌లో 50 శాతం పెట్టుబ‌డులు చేయాల్సిందిగా సూచించాడు . దానికి ఆమె అంగీక‌రించ‌లేదు. ఎట్ట‌కేల‌కు 60, 40 నిష్ప‌త్తిలో పెట్టుబడుల‌కు ఒప్పించాడు.

త‌ప్పుల‌ను స‌రిచేసుకోవ‌డం:

రియ‌ల్ ఎస్టేట్ లో ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెట్ట‌డం అత‌ను చేసి పెద్ద పొర‌పాటు . త‌క్కువ ధ‌ర ఉన్న‌ప్పుడు విక్రయించ‌డంతో రాబ‌డి కూడా త‌గ్గింది. ఇప్పుడు ప్రాపర్టీ నుంచి పెట్టుబ‌డుల‌ను మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి మ‌ళ్లించాల‌నుకుంటున్నాడు. అత‌డు చేసిన మ‌రో పొర‌పాటు ఏంటంటే బీమా పాల‌సీల‌ను పెట్టుబ‌డులుగా చూడ‌టం. ఇందులోఇప్పుడు కొన్ని మెచ్యూరిటీ పూర్త‌యిన పాల‌సీల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో పాటు కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు కూడా ఉన్నాయి. అవి కూడా ప‌న్ను ఆదా చేసే ఉద్దేశ్యంతో పెట్టుబ‌డులు పెట్టాడు. అవి ఈక్విటీ ఫండ్ల‌లో, కొన్ని బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో ఉన్నాయి. ఇలా అన్నింటిని ఏక‌తాటిపైకి తెచ్చి క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు త‌గ్గించి డెట్ ఫండ్ల‌లో పెంచేలా, రిస్క్ త‌గ్గించే విధంగా నిపుణుడు సూచ‌న‌లు అందించారు.

భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు:

ఆ దంప‌తుల మీద ఆదార‌ప‌డిన‌వారు కాని, ఇత‌ర బాధ్య‌త‌లు కానీ ఏమి లేవు. కూతురికి పెళ్లి చేశారు. కొడుకు విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం చేయ‌డం ప్రారంభించాడు. రిటైర్మెంట్ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా ఆదాయం వ‌చ్చేలా ప‌థ‌కాన్ని ఎంచుకోవాల‌నుకుంటున్నారు. అదేవిధంగా వేర్వేరు ప్ర‌దేశాల‌కు ప్ర‌యాణం చేయాల‌నుకుంటున్నారు. సంవ‌త్స‌రానికి 10-15 రోజులు విదేశాల‌కు హాలిడేకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఇంకా ఎలాంటి ఆదాయం వ‌చ్చే ప‌నులు చేయ‌కుండా త‌మ‌కు ఇష్ట‌మైన ప‌నులు చేస్తూ కాల‌క్షేపం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పొదుపు చేసిన దానిని రిటైర్మెంట్ త‌ర్వాత తిరిగి పొందేలా పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటున్నాడు. భ‌విష్య‌త్తుఅవ‌స‌రాల కోస‌మే త‌ప్ప ఆర్థిక ల‌క్ష్యాల కోసం ఈ పెట్టుబ‌డులు కాద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆరికి ఆర్థిక స‌ల‌హాదారుడు అవ‌స‌ర‌మైన రీతిలో త‌గిన సూచ‌న‌లిచ్చి పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించేలా ప్రోత్స‌హించాడు.

పెట్టుబ‌డుల విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్లు…

  • ఈక్విటీల‌లో ఎక్కువ మొత్తంలో నేరుగా పెట్టుబ‌డులు పెట్ట‌డం
  • రియ‌ల్ ఎస్టేట్‌లో ఎక్కువ పెట్టుబ‌డులు
  • బీమా పాల‌సీల‌ను పెట్టుబ‌డులుగా భావించ‌డం

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly