సింగిల్ లేదా రెగ్యుల‌ర్ ప్రీమియం ట‌ర్మ్ ప్లాన్.. ఏది మేలు?

ట‌ర్మ్ బీమాను సింగిల్ లేదా రెగ్యుల‌ర్ ప్రీమియంల‌తో ఎంచుకోవ‌చ్చు. అయితే ఈ రెండింటిలో ఏది మేలు ?ఇప్పుడు తెలుసుకుందాం

సింగిల్ లేదా రెగ్యుల‌ర్ ప్రీమియం ట‌ర్మ్ ప్లాన్.. ఏది మేలు?

జీవిత బీమా పాల‌సీ ప్రీమియంకు మీరు ఎలా చెల్లిస్తున్నారు. వార్షిక ప్రీమియమా మీ బ్యాంకులు మీకు ఒకేసారి సింగిల్ ప్రీమియంతో బీమా పాల‌సీని కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తాయి. ఎందుకంటే గృహ రుణానికి కూడా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఒకేసారి పాల‌సీ కొనుగోలు చేయాల్సిందిగా చెప్తాయి. అయితే సింగిల్ ప్రీమియం కంటే రెగ్యుల‌ర్ ప్రీమియం ప్లాన్స్ మేలు అంటున్నారు విశ్లేష‌కులు. అది ఎందుకో చూద్దాం…

రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం:

సింగిల్ ప్రీమియం ఆప్ష‌న్‌లో ఒకేసారి అధిక‌ మొత్తం ముంద‌స్తుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రెగ్యుల‌ర్ ప్రీమియం ప్లాన్‌లో అయితే క్ర‌మానుగుతంగా ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. అది నిర్ధిష్ఠ కాలం వ‌ర‌కు లేదా ట‌ర్మ్ పాల‌సీ ఉన్నంత కాలం అనేది ఎంచుకున్న ప్ర‌కారం ఉంటుంది. ప్రీమియంను ఒకేసారి కాకుండా ద‌శ‌ల‌వారిగా చెల్లిస్తాం కాబ‌ట్టి భారం త‌క్కువ‌గా ఉంటుంది.

బీమా హామీ ప‌న్ను మిన‌హాయింపులు:

సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో, మీ వ‌య‌సు 45 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ ఉన్న‌ట్ల‌యితే క‌నీస బీమా హామీ ప్రీమియంలో 125 శాతం ఉంటుంది. దీనికి మిన‌హాయింపు ల‌భించ‌దు. ఎందుకంటే వార్షికం ప్రీమియంకు 10 రెట్ల బీమా పాల‌సీకి మాత్ర‌మే ఇందుకు అవ‌కాశం ఉంటుంది. రెగ్యుల‌ర్ ప్రీమియంలో 45 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి ప‌దేళ్ల పాల‌సీకి క‌నీస హామీ వార్షిక ప్రీమియంకు ప‌ది రెట్లు ఉంటుంది.

క‌మీష‌న్లు:

సింగిల్ ప్రీమియం ప్లాన్‌ల‌లో బీమా ఏజెంట్‌కు ఒకేసారి క‌మీష‌న్ వ‌స్తుంది, ఇది ప్రీమియంలో 2 శాతం వ‌ర‌కు ఉంటుంది. రెగ్యుల‌ర్ ప్లాన్‌ల‌లో అయితే క‌మీష‌న్లు ప్రీమియం చెల్లించిన ప్ర‌తిసారి ఉంటుంది. మొద‌టి ఏడాది క‌మీష‌న్, ప‌దేళ్ల వ‌య‌సున్న‌ బీమా సంస్థ‌ల‌కు 35 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఆ త‌ర్వాత‌ ఇది 7.5 శాతంగా, నాలుగో ఏడాది నుంచి 5 శాతానికి ప‌రిమితం చేస్తారు.

దీర్ఘ‌కాలిక‌ ప్ర‌యోజ‌నాలు:

సింగిల్ ప్రీమియం ప్లాన్‌ల‌లో ఒకేసారి మొత్తం ముంద‌స్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌ పాల‌సీ తీసుకున్న ఐదో ఏడాది మ‌ర‌ణిస్తే 20 ఏళ్ల‌కు సంబంధించిన ప్రీమియంలు ఇదివ‌ర‌కే చెల్లించి ఉంటాం కాబ‌ట్టి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. రెగ్యుల‌ర్ ప్రీమియం ఎక్కువ అయిన‌ప్ప‌టికీ క్ర‌మంగా చెల్లిస్తాం కాబ‌ట్టి ప్రీమియం త‌క్కువ‌గా ప‌డుతుంది.

చివరిగా:

పైన చూసినట్టుగా టర్మ్ పాలసీ లో రెగ్యులర్ ప్రీమియం తీసుకోవడమే ఉత్తమం. ఇంటి రుణాల్లో లాగా జీవిత బీమా లో వడ్డీ ఉండదు కాబట్టి ఒకేసారి ప్రీమియం చెల్లించడం వల్ల పాలసీ దారుడికన్నా కంపెనీకే అధిక లాభం అని చెప్పాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly