ఎన్‌పీఎస్ నిబంధ‌న‌ల‌లో వ‌చ్చిన‌ 5 మార్పులు

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాల మాదిరిగానే ఎన్‌పీఎస్ విత్‌డ్రాల‌పై కూడా ఈఈఈ మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఎన్‌పీఎస్ నిబంధ‌న‌ల‌లో వ‌చ్చిన‌ 5 మార్పులు

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, పార్ల‌మెంట్ ఆమోదించిన‌ బడ్జెట్లో నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్‌) కు సంబంధించి వివిధ మార్పులు చేసింది. ముఖ్యంగా పెన్షన్ పథకం నుంచి చేసే విత్డ్రాఫై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది. అంతేకాకుండా పెన్షన్ పథకానికి కాంట్రిబ్యూట్ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

చందాదారులు నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులకు సంబంధించి నిర్వ‌హ‌ణ రుస‌ముల రిక‌వ‌రీని ఎన్‌పీఎస్ ట్ర‌స్ట్ పునఃప్రారంభించింది. ఎన్‌పీఎస్ లేదా పీఎఫ్ఆర్‌డీఏ చ‌ట్టం నియంత్రించే ఇత‌ర పెన్ష‌న్ ప‌థ‌కాల కార్యాచ‌ర‌ణ‌, సేవా స్థాయి విధుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఎన్‌పీఎస్ ట్ర‌స్ట్ భాద్య‌త వ‌హిస్తుంది.

ఎన్‌పీఎస్ విధానాల‌లో ఇటీవ‌ల చేసిన మార్పులు:

  1. నిర్వ‌హ‌ణ రుసుములు/ ఖర్చులను తిరిగి రిక‌వ‌రీ చేసేందుకు ఎన్‌పీఎస్ ట్రస్ట్‌ను అనుమతించిన తరువాత చందాదారుల ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. అంటే వార్షికంగా 0.005 శాతం చార్జీలు పెరిగాయి. "పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదించిన విధంగా, ఎన్‌పీఎస్ ట్ర‌స్టు నిర్వ‌హ‌ణ రుస‌ములు/ ఖర్చులను రిక‌వ‌రీ చేయ‌డం ప్రారంభింస్తుందని, ఆస్తుల నిర్వ‌హ‌ణ(ఏయూఎమ్‌) కోసం రోజువారీ వ్య‌యాన్ని చేరుకునేందుకు వార్షికంగా 0.005 శాతం ఛార్జీల‌ను వ‌సూలు చేస్తున్న‌ట్లు చందాదారుల‌కు ఎన్‌పీఎస్ నోటీసుల‌ను జారీచేస్తుంది. ఇది ఆగ‌ష్టు1,2019 నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఎన్‌పీఎస్ ట్ర‌స్ట్ త‌న నోటీసులో పేర్కొంది.
  1. జులైలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రిటైర్‌మెంట్ స‌మ‌యంలో, లేదా 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులో చేసే ఎన్‌పీఎస్ నిధి విత్‌డ్రాల‌పై ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కు ముందుకు ముందు 40 శాతంగా ఉన్న ఈ ప‌రిమితిని 60 శాతానికి పెంచింది.
    పదవీ విరమణ చేసిన తరువాత, చందాదారుడు ఎన్‌పీఎస్ నిధిలో 60శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు, మిగిలిన 40శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలి. దీంతో ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాల మాదిరిగానే ఎన్‌పీఎస్ విత్‌డ్రాల‌పై కూడా ఈఈఈ మిన‌హాయింపు ల‌భిస్తుంది.

  2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 14% వరకు ప్ర‌భుత్వ కాంట్రీబ్యూష‌న్‌ను మిన‌హాయించేందుకు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, సెక్ష‌న్ 80సీసీడీ(2)లో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేశారు. దీంతో ఎన్‌పీఎస్ కింద‌కి వ‌చ్చే దాదాపు 18 ల‌క్ష‌ల కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరింది. ఇది ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల‌కు వ‌ర్తించ‌దు.

  3. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ టైర్‌-II ఖాతాలో చేసే కాంట్రీబ్యూష‌న్ల‌ను కూడా సెక్ష‌న్ 80 సీ కింద‌కి తీసుకువ‌చ్చింది. అయితే క‌నీసం 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ ప‌రియ‌డ్‌తో ఉన్న మొత్తానికి మాత్ర‌మే ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

  4. ఈ సంవ‌త్స‌రం పెన్ష‌న్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ, ప్ర‌భుత్వ రంగ చందాదారుల‌కు, త‌మ చందాల‌ను నిర్వ‌హించే ఫండ్ మేనేజ‌ర్ల ఎంపిక విష‌యంలో అనేక అవ‌కాశాలు క‌ల్పించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి చందాదారులు, ప్రైవేట్ రంగానికి చెందిన ఫండ్ మేనేజ‌ర్‌ను కూడా ఎంపిక చేసుకోవ‌చ్చు. ఆస్తి కేటాయింపుల‌ను ఎన్నుకునే స్వేచ్ఛ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క‌ల్పించింది. అధిక ఈక్వీటీ ఎక్స్‌ఫోజ‌ర్‌ను అనుమ‌తించింది. అంత‌కు ముందు ఇది 15 శాతంగా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly