ఫ్లిప్‌కార్ట్ 'మొబైల్ బొనాంజా సేల్‌'

ఫ్లిప్‌కార్ట్ మార్చి 13 నుంచి 15 వ‌ర‌కు మొబైల్ బొనాంజా ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

ఫ్లిప్‌కార్ట్ 'మొబైల్ బొనాంజా సేల్‌'

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ‌ ఫ్లిప్‌కార్ట్ కొన్ని మొబైల్స్‌పై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. మార్చి 13 నుంచి 15 వ‌ర‌కు ‘మొబైల్‌ బొనాంజా సేల్‌’ పేరతో ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5 శాతం తగ్గింపు ధరను అందించనుంది. దీంతో పాటు బై బ్యాక్‌, ఎక్స్‌ఛేంజ్‌, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆప్షన్లు అందిస్తోంది. ఈ ప్రత్యేక్‌ సేల్‌ లో భాగంగా మోటరోలా, సాంసంగ్‌, షియోమీ తదితర కంపెనీ మోడల్స్‌ ధరలను తగ్గించింది.

  • గూగుల్‌ పిక్సల్‌ 2 ఎక్స్‌ఎల్‌ మోడల్ ధ‌ర రూ.73,000 కాగా, రూ.54,999 కే విక్రయించనుంది. దీనికి అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు నుంచి కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.
  • హెచ్‌టీసీ యూ11 ధ‌ర‌ను రూ.51,990 నుంచి రూ.42,999 కి త‌గ్గించింది.
  • మోటో ఎక్స్ 4 ధ‌ర రూ.24,999 కాగా, రూ.21,999 కే విక్ర‌యించ‌నుంది.
  • ఆసుస్ జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రో రూ.19,999 (రూ.23,999)
  • ఇక లెనోవో కే8 ప్లస్‌ రూ.7,999కి (రూ.10,999) లభించనుంది. ఇవే కాక మరికొన్ని మోడల్స్‌పై పలు ఆఫర్లను అందించబోతోంది.

కొన్ని మోడల్స్‌పై ధరలు తగ్గించడమే కాదు… మరికొన్ని కొత్త మోడల్స్‌పై మరికొన్ని ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇందులో నోకియా 6(4జీబీ), మోటో ఎక్స్‌ 4(6జీబీ ర్యామ్‌), మోటో జెడ్‌‌ 2 ఫోర్స్‌ (6జీబీ ర్యామ్‌), వివో వీ7, వీ 7 ప్లస్‌, ఒప్పో ఎఫ్‌ 3 ప్లస్‌ వంటి మోడళ్లపై బై బ్యాక్‌ గ్యారెంటీతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly