ఆదాయ‌పు ప‌న్ను రేట్లు, స్లాబులు, మిన‌హాయింపులు

బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం రూ. 2 కోట్ల నుంచి 5 కోట్ల మ‌ధ్య ఆదాయంపై 25 శాతం స‌ర్ చార్జ్ చెల్లించాలి.

ఆదాయ‌పు ప‌న్ను రేట్లు, స్లాబులు, మిన‌హాయింపులు

న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తొలిసారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌భుత్వం ఆదాయ‌పు ప‌న్ను స్లాబుల‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. అయితే అధిక ఆదాయం గ‌ల వ్య‌క్తుల‌కు స‌ర్ ఛార్జ్ పెంచారు. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం రూ. 2 కోట్లు లేదా అంత‌కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్య‌క్తులు చెల్లించ‌వ‌ల‌సిన స‌ర్‌చార్జ్ పెంచారు. ఇంత‌కు ముందు రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ.1కోటి వ‌ర‌కు ఆదాయం ఉన్న ప‌న్ను చెల్లింపుదారులు 10 శాతం, రూ. 1 కోటిపైన ఆదాయం ఉన్న వారు 15 శాతం స‌ర్ ఛార్జ్ చెల్లించేవారు. అయితే బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం రూ. 2 కోట్ల నుంచి 5 కోట్ల మ‌ధ్య ఆదాయంపై 25 శాతం స‌ర్ చార్జ్ చెల్లించాలి. అదేవిధంగా రూ. 5కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న‌వారు 37 శాతం స‌ర్‌ఛార్జ్ చెల్లించాలి.

మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్లో స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ రూ. 50 వేలకు పెంచ‌డంతో పాటు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 87ఏ కింద రూ. 2,500 వ‌ర‌కు ఉన్న రాయితీని రూ. 12,500కి పెంచింది. ఈ ప‌న్ను రాయితీ రూ. 5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఆదాయం ఉన్న వ్య‌క్తుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అంటే ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవత్సరానికి (2019-20),రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉండి, పన్ను పరిధిలోకి వచ్చే మదింపుదారులు పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

60 సంవ‌త్స‌రాలలోపు ప‌న్ను చెల్లింపుదారులు:
రూ.2.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న 60 సంవ‌త్స‌రాల లోపు వ్య‌క్తుల‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు. రూ.2.5 నుంచి రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వ్య‌క్తుల‌కు 5 శాతం, రూ.5లక్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వ్య‌క్తుల‌కు రూ.20 శాతం, రూ. 10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్య‌క్తులకు 30 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

ప‌న్ను రాయితీని పెంచ‌డం వ‌ల్ల రూ. 5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు కూడా పూర్తి మిన‌హాయింపును పొందే అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే పూర్తి మిన‌హాయింపు పొందుతున్న‌ప్ప‌టీ, ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు, సూప‌ర్‌సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు.

ఆదాయ‌పు ప‌న్ను ఏవిధంగా లెక్కిస్తారు:
మీ మొత్తం ఆదాయానికి ఒకే విధంగా ప‌న్ను వ‌ర్తించ‌దు. ఉదాహ‌ర‌ణికి, మీరు 60 సంవ‌త్స‌రాలోపు వ‌య‌సు వారు అయివుండి మీ మొత్తం ఆదాయం రూ.15 ల‌క్ష‌లు అనుకుందాం.

  • అందులో రూ.2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు.
  • రూ.2.5 నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు 5 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఎటువంటి మిన‌హాయింపులు లేన‌ట్ల‌యితే ఇందుకుగానూ మీరు రూ.12,500 చెల్లించాలి.
  • రూ.5 నుంచి రూ10 ల‌క్ష‌ల ఆదాయంపై 20 శాతం ప‌న్ను శ్లాబులోనికి వ‌స్తాయి. అంటే రూ. 5 ల‌క్ష‌ల‌పై 20 శాతం ప‌న్ను( రూ. 1ల‌క్ష రూపాయిలు) చెల్లించాలి.
  • రూ. 10 ల‌క్ష‌ల నుంచి రూ. 15 ల‌క్ష‌ల ఆదాయం 30 శాతం ప‌న్ను శ్లాబులోకి వ‌స్తుంది. అంటే రూ.5 ల‌క్ష‌ల‌పై రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను చెల్లించాలి.
  • మొత్తంగా రూ. 2.63 ల‌క్ష‌లు (సెస్ కాకుండా) చెల్లించాల్సి ఉంటుంది.
  • 4 శాతం సెస్ ఛార్జీల‌తో క‌లిపి రూ. 2.73 ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపులు:
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం, ప‌న్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చేసిన పెట్టుబ‌డులు, ఖర్చుల‌పై వివిధ సెక్ష‌న్ల ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, ప‌న్ను చెల్లింపుదారులు సెక్ష‌న్ 80 సీ కింద‌కి వ‌చ్చే ప‌బ్లిక్ ప్రావిడెండ్, పిల్ల‌ల చ‌దువులకు అయ్యే ఫీజులు, ఇంటి రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో చెల్లించే స్టాంప్ డ్యూటీ, వంటి ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

అదేవిధంగా సెక్ష‌న్ 80డీ, 80ఈ, 80యూ,80జీ మొద‌లైన సెక్ష‌న్ల కింద కూడా మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. ప్ర‌తీ సెక్ష‌న్ వేరు వేరు ప‌ర‌మితులు ఉంటాయి.
ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) కింద అద‌నంగా రూ. 50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly