విదేశీ పెట్టుబ‌డులు పెరుగుతాయి

ఈ సంవ‌త్స‌రం దేశీయ మార్కెట్లలో విదేశీ పెట్టుబ‌డులు కొన‌సాగుతాయ‌ని ఐసీఆర్ఏ తెలిపింది.

విదేశీ పెట్టుబ‌డులు పెరుగుతాయి

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం దేశీయ మార్కెట్ల‌లోకి విదేశీ పెట్టుబ‌డుల వెల్లువ కొన‌సాగుతుంద‌ని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తెలిపింది. రూపాయి బ‌ల‌ప‌డుతుండ‌టం, జీఎస్‌టీ వంటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వంటివి పెట్టుబ‌డుదారుల సెంటిమెంట్‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి.

సంస్థ నివేదిక ప్ర‌కారం, అక్టోబ‌ర్ 2016 నుంచి జ‌న‌వ‌రి 2017 వ‌ర‌కు దేశీయ మార్కెట్ల‌లోకి రూ.7.1 బిలియ‌న్ల డాల‌ర్ల విదేశీ పెట్టుబ‌డులు రాగా, ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 7.4 బిలియ‌న్ డాల‌ర్ల‌ విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డులు వ‌చ్చాయి. మార్చి నెల‌లో 3.9 బిలియ‌న్ డాల‌ర్లు న‌మోద‌య్యాయి. డిసెంబ‌ర్ 2011 నుంచి ఒకే నెల‌లో ఇంత‌మేర‌కు పెట్టుబ‌డులు రావ‌డం ఇదే మొద‌టిసారి. మార్కెట్ల‌లో 64.5 శాతంగా ఉన్న విదేశీ పెట్టుబ‌డుల ప‌రిమితుల్ని 74.7 శాతానికి పెంచ‌డం కూడా ఇందుకు కార‌ణం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly