జ‌న‌వ‌రి నుంచి ఉచితంగా నెఫ్ట్‌ ఆన్‌లైన్ లావాదేవీలు..

అక్టోబ‌రు 2018 నుంచి సెప్టెంబ‌రు 2019 మ‌ధ్య కాలంలో జ‌రిగిన మొత్తం న‌గ‌దు ర‌హిత చెల్లింపుల‌లో 96 శాతం డిజిట‌ల్ చెల్లింపులే

జ‌న‌వ‌రి నుంచి ఉచితంగా నెఫ్ట్‌ ఆన్‌లైన్ లావాదేవీలు..

డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది. ఇందులో భాగంగా పొదుపు ఖాతాదారులు చేసే ఆన్‌లైన్ నెఫ్ట్‌(నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ సిస్ట‌మ్‌) లావాదేవీల‌కు జ‌న‌వ‌రి 2020 నుంచి ఎటువంటి చార్జీలు విధించ‌వ‌ద్ద‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకుల‌ను కోరింది. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్ రెండూ కూడా రియ‌ల్‌టైమ్ పేమెంట్ వ్య‌వ‌స్థ‌లు, వీటిని ఆర్‌బీఐ నిర్వ‌హిస్తుంది.

స‌మ‌ర్థ‌వంత‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన‌, సురక్షిత‌మైన‌, భ‌ద్ర‌త‌గ‌ల చెల్లింపుల వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల‌ని ఆర్‌బీఐ ప్ర‌య‌త్నిస్తుంది. దీని ఫ‌లితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయ‌ని ఆర్‌బీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అక్టోబ‌రు 2018 నుంచి సెప్టెంబ‌రు 2019 మ‌ధ్య కాలంలో జ‌రిగిన మొత్తం న‌గ‌దు ర‌హిత చెల్లింపుల‌లో 96 శాతం డిజిట‌ల్ చెల్లింపులే. అదే స‌మ‌యంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్‌) ద్వారా 252 కోట్ల లావాదేవీలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా 874 కోట్ల లావాదేవీలు జ‌రిగాయి. ఒక ఏడాదిలో నెఫ్ట్ చెల్లింపులు 20 శాతం, యూపీఐ చెల్లింపులు 263 శాతం పెరిగాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly