ఫ్యూచ‌ర్ అడ్వాంటేజ్ టాప్-అప్‌.. త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ‌ హామీ

ఫ్యూచ‌ర్ అడ్వాంటేజ్ టాప్-అప్ త‌క్కువ ప్రీమియంతో ఎక్క‌వ క‌వ‌రేజ్‌ను అందిస్తుంది

ఫ్యూచ‌ర్ అడ్వాంటేజ్ టాప్-అప్‌.. త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ‌ హామీ

ఫ్యూచ‌ర్ గ్రూప్ అనుబంధ సంస్థ‌ ఫ్యూచ‌ర్ జ‌న‌ర‌ల్ ఇండియా బీమా సంస్థ (ఎఫ్‌జీఐఐ) కొత్త‌గా ఫ్యూచ‌ర్ అడ్వాంటేజ్ టాప్‌-అప్ పాల‌సీని ప్రారంభించింది. ఇది డిడ‌క్ట‌బుల్ ఆరోగ్య బీమా పాల‌సీ. మొత్తం హామీ రూ.50 వేల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇది త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ క‌వ‌రేజ్‌ను అందిస్తుంది. ఇత‌ర ఆరోగ్య బీమా పాల‌సీల‌తో పోలిస్తే ఇందులో అద‌న‌పు బీమా హామి ల‌భిస్తుంది. పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణంతో, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీ తగినది కాక‌పోవ‌చ్చు, అదే స‌మ‌యంలో ఎక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయడం అంద‌రికీ సాధ్యం కాదు. అందుకే ఈ టాప్-అప్ పాల‌సీ విస్తృత ఆరోగ్య బీమా హామీ కోసం అందుబాటులోకి తెచ్చిన‌ట్లు కంపెనీ తెలిపింది. హెల్త్‌కేర్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో నిపుణుల‌ వైద్య సహాయంతో ఉత్తమమైన చికిత్సను అందించే అవ‌కాశం ఉంటుంది. ఫ్యూచ‌ర్‌ అడ్వాంటేజ్ టాప్-అప్ పాల‌సీ వినియోగ‌దారుల‌ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అంటే డిడ‌క్ట‌బుల్ ప‌రిమితిని మించి కూడా వారు హామీని పొంద‌వ‌చ్చు. క్లెయిమ్ ఆధారంగా కాకుండా ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను బ‌ట్టి హామీని అందిస్తుంద‌ని పేర్కొంది.

ఈ పాల‌సీలో డిడ‌క్ట‌బుల్ మొత్తాన్ని ఎంచుకునేందుకు వినియోగ‌దారుల‌కు స‌దుపాయం ఉంటుంది. త‌ర్వాత దానిని సొంతంగా లేదా ఇత‌ర పాల‌సీల ద్వారా చెల్లించ‌వ‌చ్చు. వారి ఆరోగ్య అవ‌స‌రాల‌కు అనుగుణంగా పాల‌సీదారులు హామీ మొత్తాన్ని ఎంచుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇత‌ర టాప్‌-అప్ పాల‌సీల మాదిరిగా డిడ‌క్ట‌బుల్ లిమిట్‌ను క్లెయిమ్ చేసిన ప్ర‌తీసారి త‌గ్గించ‌దు. ఆసుపత్రి ఖ‌ర్చులు ఎంత అవుతాయో అంతే డిడ‌క్ట్ చేస్తారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly