జీఎస్‌టీ ఈ-ఇన్వాయిస్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న ప్ర‌భుత్వం

పన్ను ఎగవేతల అరిక‌ట్టేందుకు ఈ కొత్త వ్యవస్థ రూపొందిస్తున్న‌ట్లు జీఎస్‌టీ అధికారులు చెప్తున్నారు

జీఎస్‌టీ ఈ-ఇన్వాయిస్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న ప్ర‌భుత్వం

నిర్ణీత స్థాయికన్నా అధిక టర్నోవర్ జ‌రిగే వ్యాపారాలకు సంబంధించి ప్ర‌తీ విక్ర‌యానికి ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ద్వారా గానీ, జీఎస్‌టీ పోర్ట‌ల్ ద్వారా గానీ ‘ఈ-ఇన్వాయిస్’ను జ‌న‌రేట్ చేసేందుకు, ఒక ప్ర‌త్యేక సిస్ట‌మ్‌ను రూపొందించే విధంగా జీఎస్‌టీ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీని ద్వారా ప‌న్నుఎగ‌వేత‌లకు పాల్ప‌డే వారిని నివారించ‌వ‌చ్చ‌ని ప్రభుత్వం భావిస్తోంది.

పై విధానంలో ప్రతి ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌కు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఇది రిటర్నులు, పన్నులు దాఖలు చేసే సమయంలో సమర్పించే ఇన్వాయిస్‌లతో సరిపోవాలి. దీంతో పన్ను ఎగవేతల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని ఓ అధికారి వెల్లడించారు. ఒక ప‌రిమితికి మించి జ‌రిగే వ్యాపారాల‌లో అమ్మ‌కాల పూర్తి విలువ‌ను తెల‌సుకునేందుకు పూర్తిగా ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో ఇన్వాయిస్(ఈ-ఇన్వాయిస్‌)ను ఖ‌చ్చితంగా రికార్డు చేయ‌డం అవ‌సరం. ఇందుకోసం ప్ర‌భుత్వ లేదా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌కు అనుసంధానమైన, ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను నిర్ధిష్ట‌ స్థాయికి మించి టర్నోవరు కలిగి ఉన్న వ్యాపారులకు అందిస్తారు.

జీఎస్‌టీ కింద నమోదైన వ్యక్తి టర్నోవరు ఆధారంగా గానీ, ఇన్వాయిస్‌ విలువ ఆధారంగా గానీ ఈ-ఇన్వాయిస్‌ను ఉత్పత్తి చేస్తారు. అమ్మకాల్ని విభజించి చూపించే ప్రమాదం ఎదుర‌వ్వ‌కుండా ఉండేందుకు ట‌ర్నోవ‌ర్‌ను ఆధారంగా ఈ-ఇన్వాయిస్‌ను జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని జఎస్‌టీ అధికారి వివ‌రించారు. ఉదాహ‌ర‌ణికి, క‌నీస ఇన్వాయిస్ విలువ‌ను రూ.1000 వ‌ద్ద ఫిక్స్ చేస్తే వ్యాపార బిల్లుల‌ను విభ‌జించ‌డం ద్వారా ఇన్వాయిస్ ప‌రిమితిని త‌గ్గించే అవ‌కాశం ఉంది.

ఇ-ఇన్వాయిస్‌ జనరేషన్‌ పద్ధతి ‘ewaybill.nic.in’ లేదా జీఎస్‌టీఎన్ పోర్ట‌లోని వ‌స్తు, సేవ‌ల ప‌న్ను చెల్లింపుల పోర్ట‌ల్, ఇ-వే బిల్లు మాదిరిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిపాదిత కొత్త విధానం ఈ-ఇన్వాయిస్‌, రాబోయే కాలంలో ఈ-వే బిల్లుల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.50 వేలు మించిన వస్తువుల రవాణాకు కచ్చితంగా ఈ-వే బిల్లు సమర్పించాలి. ఈ-ట్యాక్స్ ఇన్వాయిస్‌ల విధానం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, వ్యాపారాల రిటర్నుల సమర్పణ మ‌రింత‌ సులభతరం అవుతుంది. లాటిన్ అమెరికా, సౌత్ కొరియా, యూరోప్ వంటి విదేశాల్లో అధ్యయనం చేసి, ఈ-ఇన్వాయిస్‌ జనరేషన్‌ వ్యవస్థను అమల్లోకి తెచ్చే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.

ప్రతిపాదిత ‘ఈ-ఇన్వాయిస్’ అనేది జీఎస్‌టీ ఎగ‌వేత‌ల్ని నివారించేందుకు చేసే ప్ర‌య‌త్నాల‌లో ఒక‌భాగం. జీఎస్‌టీని అమ‌లులోకి తీసుకువ‌చ్చి దాదాపు రెండు సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌స్తున్న త‌రుణంలో ప్ర‌భుత్వం ప‌న్ను ఎగ‌వేత‌ల్ని అరిక‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 1.21 కోట్ల వ్యాపారాలు జీఎస్‌టీ కింద న‌మోదైయ్యాయి. వాటిలో 20 ల‌క్ష‌ల వ్యాపారాలు కొంపోజిష‌న్ ప‌థ‌కం కింద‌కి వ‌స్తారు.

ఏఎమ్ఆర్‌జీ & అసోసియేట్స్ పార్టనర్ రజత్ మోహన్ మాట్లాడుతూ, ఈ-ఇన్వాయిస్లు నకిలీల భారిన ప‌డ‌కుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా పన్ను రాబడిని త‌నిఖీ చేయ‌వ‌చ్చ‌ని, రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌డంలో మాన్యువల్ జోక్యం తగ్గించవచ్చని తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly