లగ్జ‌రీ కార్ల‌పై సెస్సు పెంపు

విలాస‌వంత‌మైన కార్ల‌పై సెస్సును 25 శాతానికి పెంచేందుకు లోక్‌స‌భ‌ ఆమోదం తెలిపింది.

లగ్జ‌రీ కార్ల‌పై సెస్సు పెంపు

విలాస‌వంత‌మైన కార్ల‌పై సెస్‌ను పెంచేందుకు లోక్‌స‌భ‌ ఆమోదం తెలిపింది. దీంతో ఇక‌పై ఈ కార్ల‌పై సెస్ 15 శాతం నుంచి 25 శాతానికి పెర‌గ‌నుంది. ఈ కార్ల‌పై 28 శాతం జీఎస్‌టీతో పాటు పెంచిన‌ సెస్సు వ‌ర్తిస్తుంది.

జీఎస్‌టీ వ‌ల‌న‌ ఆదాయం కోల్పోయిన రాష్ర్ట‌ల‌కు ప‌రిహారం చెల్లించేందుకు ఈ నిధుల‌ను వినియోగించ‌నున్న‌ట్లు ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌ర‌కం వాహ‌నాల నుంచి హైబ్రిడ్, విలాస‌వంత‌మైన కార్ల‌పై సెస్సును 25 శాతానికి పెంచ‌నున్న‌ట్లు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో దీనిని తీసుకురానున్నారు.

ఇప్ప‌టికే జ‌న‌వ‌రి నుంచి కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు ప‌లు కంపెనీలు ప్ర‌క‌టించ‌గా ఈ సెస్సు పెంపుతో విలాస‌వంత‌మైన కార్ల ధ‌ర‌లు మ‌రింత రేట్లు పెర‌గ‌నున్నాయి. ఇవి అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly