న‌వంబ‌రులో రూ. ల‌క్ష కోట్ల‌కు పెరిగిన జీఎస్‌టీ ఆదాయం

న‌వంబ‌రు 2018 పోలిస్తే, ఈ సంవత్స‌రం న‌వంబ‌రులో జీఎస్‌టీ వ‌సూళ్ళు 6శాతం మేర వృద్ధి చెందాయి

న‌వంబ‌రులో రూ. ల‌క్ష కోట్ల‌కు పెరిగిన జీఎస్‌టీ ఆదాయం

న‌వంబ‌రు నెల‌లో జీఎస్‌టీ(వ‌స్తు సేవ‌ల ప‌న్ను) ఆదాయం పెరిగింది. మూడు నెల‌ల త‌రువాత న‌వంబ‌రులో జీఎస్‌టీ ఆదాయం రూ. ల‌క్ష కోట్ల మార్కును దాటి పెరిగింది. అంత‌కు ముందు సంవ‌త్స‌రంతో పోలిస్తే 6 శాతం ఆదాయం పెరిగి రూ.1.03 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. వ‌రుస‌గా రెండు నెల‌ల నుంచి వృద్ధి రేటు త‌గ్గుతూ వ‌స్తుంది. అయితే గ‌త నెల‌లో వృద్ధి రేటు మాత్రం ఆశాజ‌న‌కంగా ఉంది.

అక్టోబ‌రు నెల‌లో రూ.95,380 కోట్ల జీఎస్‌టీ వ‌సూలు అయ్యింది. 2018 న‌వంబ‌రులో రూ.97,637 కోట్ల జీఎస్‌టీ వ‌సూలు కాగా 2019 నవంబ‌రులో రూ. 1,03,492 కోట్లు వ‌సూలు అయ్యింది. వీటిలో సీజీఎస్‌టీ రూ. 19,592 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.27,144 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.49,028 కోట్లు(దిగుమ‌తుల‌పై సేక‌రించిన రూ.20,948 కోట్ల‌తో క‌లిపి), సెస్ రూ.7,727 కోట్లు(దిగుమ‌తుల‌పై సేవ‌రించిన రూ.869 కోట్ల‌తో క‌లిపి) గా వ‌సూలు అయిన‌ట్లు అధికారిక నివేదిక తెలుపుతుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly