కొత్త జీఎస్‌టీ దాఖ‌లు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్‌టీ కౌన్సిల్‌

జీఎస్‌టీ కొత్త రిటర్న్‌ల విధానం అక్టోబరు నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది

కొత్త జీఎస్‌టీ దాఖ‌లు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్‌టీ కౌన్సిల్‌

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) దాఖ‌లు చేసేందుకు కొత్త రిట‌ర్న్ ఫార‌మ్‌ల‌ను జులైతో ప్రారంభించి మూడు నెల‌ల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా వ్యాపారులు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. జీఎస్‌టీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ప్ర‌స్తుతం కంపెనీలు, వ్యాపార‌స్తులు, జీఎస్‌టీఆర్‌-3బి లేదా జీఎస్‌టీ ఆర్‌ఈటీ-01 స‌మ‌రీ ఫార‌మ్ విధానాన్ని ఉప‌యోగిస్తున్నారు. అయితే దీని స్థానంలో రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు జీఎస్‌టీ ఏఎన్ఎక్స్‌-1 ( ఔట్‌వ‌ర్డ్‌ స‌ర‌ఫ‌రా వివ‌రాలను పొందు ప‌రిచేందుకు), జీఎస్‌టీ ఏఎన్ఎక్స్‌-2(కొనుగోళ్ళ వివ‌రాలు) జీఎస్‌టీ ఆర్ఈటీ-1 ఫార‌మ్‌ను (ఆఖ‌రిగా రిటర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు) తీసుకురానున్న‌ట్లు జీఎస్‌టీ కౌన్సిల్ వెల్ల‌డించింది.

కొత్త‌గా వ‌చ్చిన‌ కొనుగోళ్ళు, అమ్మ‌కాల ఫార‌మ్‌ల‌ను జులై నుంచి సెప్టెంబరు వరకు ప్రయోగాత్మక పద్ధతిలో వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చని, తద్వారా ఆవిధానం అమల్లోకి వచ్చేనాటికి దానికి అలవాటు పడతారని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ వ్యాపారులు ప్ర‌స్తుతం ఉన్న జీఎస్‌టీఆర్‌1, జీఎస్‌టీర్ 3బీ విధానంలో రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాలి.

ప‌న్ను చెల్లింపుదారులు ప్ర‌యోగాత్మ‌క ప‌ద్ద‌తిలో దాఖ‌లు చేసే ఫార‌మ్‌ల వ‌ల్ల ప‌న్ను , ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. ఈ సమ‌యంలో ప‌న్ను చెల్లింపు దారులు జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-3బీ ల‌ను దాఖ‌లు చేయ‌డం ద్వారా వారి ప్ర‌మాణాల‌ను నేర‌వేర్చ‌డాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. ప‌న్ను చెల్లింపుదారులు, వారి ఔట్ వ‌ర్డ్ స‌ర‌ఫ‌రా వివ‌రాల‌ను నెల‌వారీగా/త‌్రైమాసిక ప్రాతిప‌దిక‌న జీఎస్‌టీర్‌-1లో , రిట‌ర్నుల‌ను నెల‌వారీగా జీఎస్‌టీఆర్‌-3బీలోనూ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

జీఎస్‌టీ కొత్త రిటర్న్‌ల(జీఎస్‌టీ ఏఎన్ఎక్స్‌-1) విధానం అక్టోబరు నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. జ‌న‌వ‌రి 2020 నుంచి ప్ర‌స్తుత వున్న జీఎస్‌టీర్‌3, జీఎస్‌టీఆర్‌1 లు పూర్తి స్థాయిలో ర‌ద్ద‌వుతాయ‌ని తెలిపింది. 2019 అక్టోబరు నుంచి జీఎస్‌టీ ఏఎన్‌ఎక్స్‌-1 ఫారం దాఖలు చేయ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly