సాధార‌ణ బీమా సంస్థ‌ల ప్రీమియంల ఆదాయం ల‌క్ష కోట్లు

దేశంలో బీమా రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో బీమా రంగం ఆదాయం అధికంగా న‌మోదైంది.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి 10 నెల‌ల్లో సాధార‌ణ బీమా సంస్థ‌ల ప్రీమియంల ద్వారా ఆదాయం 32 శాతం వృద్ధి చెందింది. జ‌న‌వ‌రి 2017 చివ‌రి నాటికి ఆదాయం ల‌క్ష కోట్లు దాటింద‌ని బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పంట‌లు, ఆస్తి బీమాలు అధికంగా న‌మోద‌య్యాయి.

నివేదిక ప్ర‌కారం గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్‌-జ‌న‌వ‌రి ప‌ది నెల‌ల కాలంలో రూ.78,709 కోట్ల ప్రీమియంల ఆదాయం న‌మోదు కాగా. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి 10 నెల‌ల్లో బీమా రంగం 32 శాతం వృద్ధితో రూ.1.04 ల‌క్ష‌ల కోట్లకు పెరిగాయి.

ఆరోగ్య బీమా విభాగంలో రూ.4,276 కోట్ల ఆదాయం చేకూరింది. ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ‌లు 46.99 శాతం, ప్రైవేటు బీమా సంస్థ‌లు 42.03 శాతం మేర‌కు వృద్ధిని క‌న‌బ‌రిచాయి.

ఎల్ & టీ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ను సొంతం చేసుకున్న త‌ర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ 4.9 శాతం వృద్ధితో అతిపెద్ద బీమా సంస్థ‌ల్లో నాలుగ‌వ స్థానానికి చేరింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly