భారీగా పెరుగుతోన్న‌ బంగారం ధ‌ర‌

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుంద‌న్న ఆందోళ‌న‌ల‌తో పెట్టుబ‌డుల భ‌ద్ర‌త కోసం బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు

భారీగా పెరుగుతోన్న‌ బంగారం ధ‌ర‌

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో బంగారం ధ‌ర‌లు అత్య‌ధిక గ‌రిష్ఠంగా న‌మోద‌వుతున్నాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబ‌ర్ గోల్డ్ ఫ్యూచ‌ర్లు 0.70 శాతానికి పెరిగి గ‌రిష్ఠంగా రూ.38,525 గా న‌మోదైంది . సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్లు 1.4 శాతం పెరిగి రూ.44,280 కి చేరాయి. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డంతో పాటు రూపాయి బ‌ల‌హీన‌త కూడా బంగారం ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. దిల్లోలో నేడు బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.38,470గా న‌మోదైంది.

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు 1,500 డాల‌ర్ల స్థాయికి ఎగువ‌లో ఉన్నాయి. నేడు ధ‌ర 0.6 శాతం పెరిగి 1,505 డాల‌ర్ల‌కు చేరింది. అంత‌ర్జాతీయ ఆర్థిక మంద‌గ‌మ‌నం ఇందుకు కార‌ణంగా చెప్తున్నారు.

గ‌త వారంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా లేమ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సెప్టెంబ‌ర్ ఫ్యూచ‌ర్లపై ప్ర‌భావం డే అవ‌కాశం ఉంది. అమెరికా-చైనా మ‌ధ్య చాలాకాలంగా జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ వంటి అంశాలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నాయి.

ఈ ఏడాది ప్ర‌పంచ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు మొత్తంగా చూసుకుంటే 17 శాతం పెరిగాయి. ఈ వారంలో జ‌ర‌గ‌నున్న ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ స‌మావేశం కోసం బంగారం ట్రేడ‌ర్లు వేచిచూస్తున్నారు.

వాణిజ్య యుద్ధ భ‌యాలు , బ్రెగ్జిట్, ఇత‌ర రాజ‌కీయ స‌మ‌స్య‌లతో బాండ్లు, బంగారం లోకి పెట్టుబ‌డులు వెళ్తున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో భార‌త్‌లోకి బంగారం దిగుమ‌తులు 35.5 శాతం పెరిగి 11.45 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌య్యాయి. అయితే ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నందున‌ దిగుమతులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly