'గూగుల్ పే' తో ఫాస్టాగ్ రీఛార్జ్‌

వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను ఈజీగా రీఛార్జ్‌ చేసుకునేలా.. ప్రత్యేక యూపీఐ సౌకర్యాన్ని 'గుగూల్ పే' యాప్‌ ద్వారా ప్రారంభించింది

'గూగుల్ పే' తో ఫాస్టాగ్ రీఛార్జ్‌

డిజిటల్ లావాదేవీల మొబైల్ యాప్ ‘గూగుల్ పే’ వినియోగదారులకు మరో సర్వీసును కూడా తీసుకొచ్చింది. కార్లు ఉన్న వినియోగదారులందరికీ ఇప్పుడు ఫాస్టాగ్ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారుల కోసం… గూగుల్ పే రిచార్జ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను ఈజీగా రీఛార్జ్‌ చేసుకునేలా… ప్రత్యేక యూపీఐ సౌకర్యాన్ని ‘గుగూల్ పే’ యాప్‌ ద్వారా ప్రారంభించింది. గూగుల్‌పేకు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌ చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడమే కాకుండా, అందులో ఉన్న బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉన్నట్లు తెలిపింది.
ఈ యాప్ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగ‌దారులు…

  • గూగుల్ పే యాప్‌లోకి వెళ్లిన తర్వాత… బిల్‌ పేమెంట్స్‌ ఆప్షన్ ఎంచుకోవాలి
  • ఆ తర్వాత కింద ఉన్న సెక్షన్‌లలో ఫాస్టాగ్‌ కేటగిరి ఎంచుకొని, ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకును సెల‌క్ట్ చేసుకోవాలి
  • అప్పుడు వెహికల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి… బ్యాంకు ద్వారా పేమేంట్ పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly