జీపీఎఫ్ పై వ‌డ్డీరేట్లు త‌గ్గించిన ప్ర‌భుత్వం

ప్ర‌భుత్వం జీపీఎఫ్ వ‌డ్డీరేట్లను 8 శాతం నుంచి 7.9 శాతానికి త‌గ్గించింది. ఇది జులై 1,2019 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

జీపీఎఫ్ పై వ‌డ్డీరేట్లు త‌గ్గించిన ప్ర‌భుత్వం

ఆర్థిక వ్యవస్థలో మొత్తం వడ్డీ రేట్ల త‌గ్గుద‌ల‌కు అనుగుణంగా ప్రభుత్వం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌), ఇతర సారూప్య ఫండ్ ల‌పై వడ్డీ రేటును తగ్గించింది. జులై-సెప్టెంబరులో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇత‌న‌ సారూప్య ఫండ్ ల‌పై మునుపటి త్రైమాసికంలో 8% తో పోలిస్తే, దాని చందాదారులకు 7.9% వడ్డీ రేటును చెల్లించ‌నుంది. ఈ వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, రక్షణ దళాల ప్రావిడెంట్ ఫండ్లపై వర్తిస్తుంది. ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ రేటు జూలై 1, 2019 నుండి అమలులో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది.

వ‌డ్డీరేట్లు త‌గ్గ‌నున్న పండ్లు:

  1. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్).
  2. కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా).
  3. ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్.
  4. స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్.
  5. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్).
  6. ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్.
  7. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్.
  8. ఇండియన్ నావల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్.
  9. రక్షణ సేవల అధికారులు ప్రావిడెంట్ ఫండ్.
  10. సాయుధ దళాల సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీపీఎఫ్‌ పై వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. అప్పటి నుండి రేట్లు మారలేదు.

ఆర్థిక వ్యవస్థలో మొత్తం వడ్డీ రేటు త‌గ్గిన త‌రుణంలో జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌తో సహా కొన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్ 7.9% వడ్డీ రేటు (వార్షిక) పొందుతుంది, అంతకుముందు త్రైమాసికంలో 8%.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly