కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌పై స్ప‌ష్ట‌త‌

లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌ విష‌యంలో ముఖ్య‌మైన స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌పై స్ప‌ష్ట‌త‌

కొవిడ్-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌ విష‌యంలో ముఖ్య‌మైన స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. ప్రాథమిక నిబంధన 56 ప్రకారం మార్చి 31,2020 న సూపరన్యునేషన్ వయస్సును చేరుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ కారణంగా, వారు ఇంటి నుంచి పని చేస్తున్నారా లేదా కార్యాలయంనుంచి పని చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా మార్చి 31 న కేంద్ర ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేయాలి. లాక్‌డౌన్ కార‌ణంగా, ప్రభుత్వం అనేక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించింది.

సిసిఎస్ (సిసిఎ) నిబంధనలు 1965, సిసిఎస్ (పెన్షన్) నిబంధనలు 1972 ప్రకారం విభిన్న ప్రయోజనాల కోసం పరిమితి వ్యవధిని లెక్కించడాన్ని ప్రభుత్వం స‌వ‌రించింది.

కొవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో మార్చి 24 నుంచి తరువాత లాక్‌డౌన్ విధించ‌డంతో కొన్ని వాయిదా ప‌డిన ప‌నులు ఉంటే లాక్‌డౌన్ పూర్త‌యిన త‌ర్వాత చేయ‌వ‌చ్చు. ఉదాహరణకు, లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఒక ప్రక్రియ / పని / ఈవెంట్ పూర్తి చేయడానికి గడువు తేదీ 20 రోజులు ఉంటే 20 లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత 20 రోజుల్లో పనిని పూర్తి చేయాలి. ఇక‌ పనిని పూర్తి చేయడానికి 15 రోజుల కన్నా తక్కువ సమయం ఉంటే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత, 15 రోజుల్లోపు ప్రక్రియలను పూర్తి చేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly