కార్పొరేట్‌ ప‌న్ను 22 శాతానికి త‌గ్గింపు

జులై 5 కంటే ముందు బైబ్యాక్ ప్ర‌క‌టించే లిస్టెడ్ కంపెనీల‌కు ప‌న్ను ఉండ‌దు

కార్పొరేట్‌ ప‌న్ను 22 శాతానికి త‌గ్గింపు

ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊత‌మిచ్చేలా ప్ర‌భుత్వం మ‌రిన్ని ఉద్దీప‌న‌ల‌ను ప్ర‌క‌టించింది. దేశీయ‌ కంపెనీల‌కు కార్పొరేట్ ప‌న్ను 22 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సెస్‌, స‌ర్ ఛార్జీలు క‌లిపి కార్పొరేట్ ప‌న్ను 25.17 శాతానికి త‌గ్గింది. అయితే ఈ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహ‌కాలు ల‌భించ‌వు. అదేవిధంగా అక్టోబ‌ర్ 1 త‌ర్వాత ఏర్పాటయ్యే కొత్త త‌యారి సంస్థ‌ల ఆదాయ ప‌న్ను 15 శాతానికి త‌గ్గించారు. సెస్, స‌ర్‌ఛార్జ్‌తో క‌లిపి ఈ సంస్థ‌లకు ప‌న్ను 17.01 శాతంగా ఉండ‌నుంది.

ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, క‌నీస ప్ర‌త్యామ్నాయ ప‌న్ను ( ఎంఏటీ) కూడా 18.5 శాతం నుంచి 15 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈక్విటీ అమ్మకాల‌పై ల‌భించిన‌ మూలధన లాభాలపై జూలై బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సర్‌చార్జి పెరుగుదలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలో చేసిన కొత్త నిబంధ‌న‌ల‌ వ‌ల‌న ప్ర‌భుత్వంపై రూ.1,45,000 భారం ప‌డ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నిర్ణ‌యాల‌తో పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం రూ.400 కోట్ల‌ వ‌ర‌కు ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీల‌కు సెస్, స‌ర్ ఛార్జ్ కాకుండా30 శాతం ప‌న్ను ప‌డుతుంది. కొత్త త‌యారీ కంపెనీల‌కు ఇది 25 శాతంగా ఉంది.

ఈ కొత్త నిబంధ‌న‌లు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వ‌ర్తిస్తాయి. త‌యారీ రంగంలో పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించేందుకు, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బ‌ల‌ప‌రిచేందుకు ఈ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. అదేవిదంగా జూలై 5 లోపు షేర్ బైబ్యాక్‌లను ప్రకటించిన లిస్టెడ్ కంపెనీలకు బైబ్యాక్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని సీతారామన్ ప్ర‌క‌టించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly