పెన్షన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త

దాదాపు 6.3 లక్షల మంది ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు వీరిందరికీ ప్రయోజనం కలుగుతుంది

పెన్షన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త

ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త అందించింది. రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఉద్యోగి ‘కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే… పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందజేస్తారు. ఇక్కడ మీకు రావాల్సిన పెన్షన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో పెన్షన్‌ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడం జరుగుతుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు.

2008 సెప్టెంబర్‌ 25, అంతకంటే ముందు ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఈపీఎఫ్‌వో నిర్ణయాన్ని ఈ నెల 20న కేంద్ర కార్మిక శాఖ నోటిఫై చేసింది. గతంలో పెన్షన్‌ కమ్యుటేషన్‌ ఆప్షన్‌ను రద్దు చేసిన ఈపీఎఫ్‌వో… దాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ‘కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే… పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ నిర్ణయం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. 2008 సప్టెంబర్ 26కు ముందు పదవీ విరమణ చేసిన వారికే ఈ కొత్త ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అలాగే వీరు రిటైర్మెంట్ సమయంలో కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకొని ఉండాలి. దాదాపు 6.3 లక్షల మంది ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు వీరిందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ పెన్షన్ వస్తుంది.

ఇకపోతే పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ అంశానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 2019 ఆగస్ట్ 21న జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ స‌మావేశంలో ఆమోదం తెలిపింది. కాగా ఈపీఎఫ్‌వో 2009లో పెన్షన్ కమ్యుటేషన్ స‌దుపాయాన్ని ఉపసంహరించింది. దీంతో దీని కన్నా ముందు పదవీ విరమణ చేసి కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం వీరికి తీపికబురు అందించింది. పెన్షన్ కమ్యుటేషన్ పున‌రుద్ధ‌రించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly