బిల్డ‌ర్లు ఇక‌పై ప‌న్ను రేట్ల‌ను ఎంచుకోవ‌చ్చు

నిర్మాణం పూర్తి కాని ఇళ్ల‌పై బిల్డ‌ర్లు ఇప్పుడు రెండు ర‌కాల ప‌న్నుల నుంచి ఏదైనా ఎంచుకునే అవ‌కాశం ఉంది.

బిల్డ‌ర్లు ఇక‌పై ప‌న్ను రేట్ల‌ను ఎంచుకోవ‌చ్చు

జీఎస్‌టీ కౌన్సిల్ 34 వ స‌మావేశంలో నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టుల‌పై ప‌న్నుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌న్ను రేటును బిల్డ‌ర్లు నిర్ణ‌యించుకునే విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టుల బిల్డ‌ర్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో క‌లిపి 12 శాతం లేదా ఇన్‌పుట్ ట్యాక్స్ లేకుండా 5 శాతం ప‌న్నును ఎంచుకోవ‌చ్చు. అదేవిధంగా ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌ (పీఎంఏవై) హౌజింగ్ ప్రాజెక్టుల‌పై ట్యాక్స్ రీబేట్‌ల‌తో క‌లిపి 8 శాతం, అది కాకుండా అయితే 1 శాతం ప‌న్ను రేట్ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుందిని రెవెన్యూ సెక్ర‌ట‌రీ అజ‌య్ భూష‌ణ్ పాండే తెలిపారు. ఏప్రిల్ 1 నాటికి పూర్తి కాని భవనాల విషయంలో పన్నుల రేట్లను నిర్ణీత సమయాలలో అమలు చేయవలసి ఉంటుంది, ఆ విష‌యాలు త‌ర్వాత నోటిఫై చేయ‌నున్న‌ట్లు పాండే చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభ‌మ‌య్యే కొత్త ప్రాజెక్టుల‌కు త‌క్కువ ప‌న్ను రేట్లు వ‌ర్తిస్తాయి. నేడు తీసుకున్న నిర్ణ‌యంతో నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌పై స్ప‌ష్ట‌త ఏర్ప‌డింది.

ఫిబ్ర‌వ‌రి 24 న జ‌రిగిన స‌మావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్, నిర్మాణంలో ఉన్నరెసిడెన్షియ‌ల్ ప్రాప‌ర్టీల‌పై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో క‌లిపి 12 శాతం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా అయ‌తే 5 శాతంగా ప‌న్ను రేట్ల‌ను నిర్ణ‌యించింది. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌ (పీఎంఏవై) ఇళ్ల‌పై ట్యాక్స్ రిబేట్‌ల‌తో క‌లిపి 8 శాతం లేదా 1 శాతంగా ప్ర‌క‌టించారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly