హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభం రూ.3865 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడ‌వ త్రైమాసికానికి నిక‌ర లాభం 15.15 శాతం పెరిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభం రూ.3865 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్‌ త్రైమాసికంలో 15.15 శాతం నిక‌ర లాభాన్ని న‌మోదు చేసింది. డిసెంబ‌ర్ త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంకు నిక‌ర లాభం రూ.3865.33 కోట్ల‌కు చేరింది. గ‌త సంవ‌త్స‌రం ఇదే స‌మ‌యానికి ఇది రూ.3356.84 కోట్లు. మొత్తం ఆదాయం 13.48 శాతం పెరిగి 20748.27 కోట్లను న‌మోదు చేసింది. క్రితం ఏడాది ఇది రూ.18283.31 కోట్లుగా ఉంది.

బ్యాంకు స్థూల నిర‌ర్థ‌క ఆస్తులు 1.05 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇవి 0.97 శాతంగా న‌మోద‌య్యాయి. బ్యాంకు నిక‌ర నిర‌ర్థ‌క ఆస్తులు 0.32 శాతంగా ఉన్నాయి.

బ్యాంకులో ప్ర‌మోట‌ర్ల‌కు 26.09 శాతం వాటా ఉండ‌గా, ఇత‌ర సంస్థ‌ల‌కు 54.37 శాతం, సంస్థేత‌రుల‌కు 19.55 శాతం వాటాలు ఉన్నాయి. బ్యాంకు ప్ర‌స్తుత మార్కెట్ విలువ రూ.323254.83 కోట్లు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ప్ర‌స్తుతం బీఎస్ఈలో రూ.22.20 పెరిగి రూ.1267 వ‌ద్ద న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 104343 షేర్లు చేతులు మారాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly