హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచాయ్ ప్లస్

హామీరాబ‌డితో కూడిన‌ బీమాప‌థ‌కం ఎంచుకునే ముందు పాలసీ కాల‌ప‌రిమితి, ప్రీమియం చెల్లించే కాల‌ప‌రిమితి, చెల్లింపు కాలం మూడు విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంచాయ్ ప్లస్

జీవిత బీమా ప్రధానంగా జీవిత రక్షణ అందించడం లక్ష్యంగా ఉంటుంది. పాల‌సీదారుని పై ఆధార‌ప‌డిన వారి ఆదాయం భ‌ర్తీ చేస్తుంది. దీర్ఘకాలిక అవసరాల కోసం ఆదా చేయడానికి జీవిత బీమా పథకాలను కూడా ఉపయోగించవచ్చు. సాధార‌ణ జీవిత బీమా పాల‌సీల‌తో పాటు పాలసీ చివరిలో కొంత మొత్తాన్ని అందించడం, క్ర‌మ‌మైన ఆదాయం అందించే పాల‌సీల‌ను కూడా జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ పాల‌సీల ద్వారా నిర్దిష్ట సంవత్సరాలకు లేదా జీవితకాలం వరకు ఆదాయం పొందవచ్చు. అలాంటి ప్ర‌ణాళిక హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సాంచే ప్లస్. ఇది బోనస్ స్థానంలో హామీ జోడింపులతో ఉండే సాంప్రదాయ జీవిత బీమా ప్రణాళిక. బోనస్ బీమా చేసిన లాభాలపై ఆధారపడి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ సాంచాయ్ ప్లస్‌లో అందుబాటులో ఉన్న 4 ప్లాన్ ఆప్షన్లలో పాల‌సీదారులు త‌మ‌ జీవిత దశ, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయించుకోవాలి. ఎంచుకునేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు గమ‌నించాలి. పాలసీ కాల‌ప‌రిమితి, ప్రీమియం చెల్లించాల్సిన కాలం, చెల్లింపుల అందే కాలం.

అందుబాటులో ఉన్న ఆప్ష‌న్లు:
1.హామీ మెచ్యూరిటీ
ఈ ఆప్ష‌న్ లో పాలసీ వ్యవధి ముగింపులో కొంత మొత్తంగా చెల్లించాల్సిన హామీ మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. హామీ ఇచ్చిన ఆదాయం మొత్తం మెచ్యూరిటీ బెనిఫిట్ కి స‌మానం. ఈ మొత్తం పాల‌సీదారులు చెల్లించిన మొత్తం ప్రీమియం ల ఆధారంగా ఉంటుంది.
పాల‌సీ కాల‌ప‌రిమితి- 10, 12,20 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు - 5, 6 ,10 సంవత్సరాలు

2.హామీ ఆదాయం
ఈ ఆప్ష‌న్ 10 లేదా 12 సంవత్సరాల స్థిర కాలానికి హామీ ఆదాయాన్ని అందిస్తుంది.ఈ ఆదాయం పాల‌సీదారులు చెల్లించిన మొత్తం ప్రీమియం ల ఆధారంగా ఉంటుంది.
పాల‌సీ కాల‌ప‌రిమితి - 11, 13 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు - 10, 12 సంవత్సరాలు

  1. జీవితకాలం ఆదాయం
    ఈ 99 సంవత్సరాల వయస్సు వరకు హామీ ఇచ్చే సాధారణ ఆదాయాన్ని , చెల్లింపు వ్యవధి ముగింపులో ప్రీమియం తిరిగి ఇస్తుంది.హామీ ఇచ్చిన ఆదాయం మొత్తం మెచ్యూరిటీ బెనిఫిట్ కి స‌మానం. ఈ మొత్తం పాల‌సీదారులు చెల్లించిన మొత్తం ప్రీమియం ల ఆధారంగా ఉంటుంది.

పాల‌సీ కాల‌ప‌రిమితి - 6, 11 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపు - 5 , 10 సంవత్సరాలు

మెచ్యూరిటీ బెనిఫిట్ 99 సంవత్సరాల వయస్సు వరకు హామీ ఉన్న‌ ఆదాయం చెల్లిస్తారు. ఈ ఆదాయం పాల‌సీదారులు చెల్లించిన మొత్తం ప్రీమియం ల ఆధారంగా ఉంటుంది. ముగింపులో చెల్లించిన మొత్తం ప్రీమియంల మొత్తం తిరిగి పొంద‌వ‌చ్చు.

  1. దీర్ఘకాలిక ఆదాయం
    ఈ ఆప్ష‌న్ లో 25 లేదా 30 సంవత్సరాల దీర్ఘకాలిక హామీతో కూడిన రెగ్యులర్ ఆదాయాన్ని, చెల్లింపు వ్యవధి ముగింపులో ప్రీమియం తిరిగి ఇస్తుంది.హామీ ఇచ్చిన ఆదాయం మొత్తం మెచ్యూరిటీ బెనిఫిట్ కి స‌మానం. ఈ మొత్తం పాల‌సీదారులు చెల్లించిన మొత్తం ప్రీమియం ల ఆధారంగా ఉంటుంది.
    పాల‌సీ కాల‌ప‌రిమితి - 6, 11 సంవత్సరాలు
    ప్రీమియం చెల్లింపు - 5 , 10 సంవత్సరాలు

ఎలా నిర్ణయించుకోవాలి?
హామీతో కూడిన రాబ‌డి అందించే బీమా పధకాలు ఖరీదైనవి. సాంప్రదాయ బీమా పథకాలైన ఎండోమెంట్స్చ‌ మనీ బ్యాక్ ప్లాన్స్ అంతర్గత రేటు (ఐఆర్ఆర్) సుమారు 6 శాతం, హామీతో కూడిన రాబ‌డి ప‌థ‌కాల్లో ఇంకా తక్కువగా ఉండవచ్చు. అలాగే, పాలసీలో హామీతో రాబ‌డి లేదా ప్రీమియం తిరిగి రావడం దీర్ఘకాలిక పెట్టుబడికి పెద్దగా సహాయపడదు.అత్యధిక పన్ను స్లాబ్‌లో ఉన్నవారికి ఈ ప్రణాళిక ఉప‌యోగ‌క‌రంగా ఉండవచ్చు. తక్షణం కాకుండా తరువాతి కాలంలో పన్నురహిత ఆదాయాన్ని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. సాంప్రదాయ బీమా పధకాలు సంపదను సృష్టించడం, ద్రవ్యోల్బణాన్ని మించిన‌ రాబడిని అందించ‌వ‌నే చెప్పాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly