హెచ్‌డీఎఫ్‌సీ ఎస్ఎల్‌ యంగ్‌స్టార్ సూప‌ర్ ప్రీమియం పాల‌సీ

ఈ పాల‌సీ పిల్ల‌ల‌ ఉన్న‌త విద్య‌కు తోడ్పుడుతుంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది

హెచ్‌డీఎఫ్‌సీ ఎస్ఎల్‌ యంగ్‌స్టార్ సూప‌ర్ ప్రీమియం పాల‌సీ

హెచ్డీఎఫ్‌సీ ఎస్ఎల్ యంగ‌స్టార్ సూప‌ర్ ప్రీమియం అనేది ఒక యులిప్. పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం పొదుపుతో పాటు బీమా హామీని పొందేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పాల‌సీని కొనుగోలు చేస్తే భ‌విష్య‌త్తులో పిల్ల‌ల చ‌దువు, వివాహం, ఇల్లు, కారు కోసం రుణం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

హెచ్‌డీఎప్‌సీ ఎస్ఎస్ యంగ్‌స్టార్ సూప‌ర్ ప్రీమియం ఫీచ‌ర్లు:

సాధార‌ణంగా త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తును ఇవ్వాల‌నుకుంటారు. ముఖ్యంగా మంచి ఉన్న‌త విద్య‌ను అందించాల‌నుకుంటారు. విద్య‌కు మించిన ల‌గ్జ‌రీ ఏం లేదు. జీవితంలో ఉన్న‌త స్థానానికి వెళ్లాలంటే చ‌దువు ఉండాల్సిందే. కానీ రోజురోజుకు పెరుగుతున్న పోటీ, ఖ‌ర్చుల‌తో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతోంది. అయితే ఈ పాల‌సీలు పిల్ల‌ల ఉన్న‌త విద్య‌తో పాటు త‌ల్లిదండ్రులు దూర‌మైతే ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు సాయ‌ప‌డ‌తాయి.

రిస్క్ తీసుకునే దానిని బ‌ట్టి నాలుగు ర‌కాల ఫండ్లు ఎంచుకోవ‌చ్చు

ఇన్‌క‌మ్ ఫండ్ - ఎక్కువ రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది ఎందుకంటే ఎక్క‌వ కాలం పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంటుంది.

బ్యాలెన్స్‌డ్ ఫండ్ - ఈక్విటీ పెట్టుబ‌డులు రాబ‌డిని సాధిస్తే, డెట్ ఫండ్లు ఒడుదొడుకులు ఉన్న‌ప్పుడు కాపాడ‌తాయి.

బ్లూచిప్ ఫండ్- పెట్టుబ‌డులు లార్జ్ క్యాప్ ఈక్విటీల‌లో పెడతారు.

ఆప‌ర్చునిటీస్ ఫండ్ - మిడ్ క్యాప్ ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెడతారు.

ప్ర‌యోజ‌నాలు:

పొదుపు

త‌ల్లిదండ్రులు అనుకోకుండా మ‌ర‌ణిస్తే లేదా తీవ్ర వ్యాదుల భారిన ప‌డితే :

 • బీమా హామీ మొత్తం పిల్ల‌ల‌కు ల‌భిస్తుంది
 • భ‌విష్య‌త్తులో ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
 • మెచ్యూరిటీ త‌ర్వాత ఫండ్ విలువ ల‌బ్దిదారుల‌కు (పిల్ల‌ల‌కు) తిరిగి చెల్లిస్తారు

పొదుపుతో పాటు రాబ‌డి:

త‌ల్లిదండ్రులు అనుకోకుండా మ‌ర‌ణిస్తే, తీవ్ర వ్యాదుల బారిన ప‌డితే,

 1. బీమా హామీ మొత్తం పిల్ల‌ల‌కు ల‌భిస్తుంది.
 2. భవిష్యత్ ప్రీమియంలలో 50% పాలసీ చెల్లిస్తుంది.
 3. మెచ్యూరిటీ త‌ర్వాత‌ లబ్ధిదారునికి ఫండ్ విలువ ల‌భిస్తుంది
 • ప్రీమియం , హామీని బ‌ట్టి మీ పిల్ల‌ల‌కు స‌రిప‌డే ప్లాన్ ఎంచుకోవాలి
 • ఫండ్ ఎంపికలను మార్చడం ద్వారా లేదా భవిష్యత్ ప్రీమియంలను వేరే ఫండ్ ఎంపికగా మార్చడం ద్వారా మీ పెట్టుబడుల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.
 • ఎటువంటి వైద్య పరీక్షలు లేకుండా, చిన్న వైద్య ప్రశ్నాపత్రం ఆధారంగా ఇబ్బంది లేకుండా పాలసీ జారీ చేస్తారు.
 • సెక్ష‌న్ 80సీ, 10(10డీ)ఆదాయం ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం ప‌న్ను ప్రయోజ‌నాలు ల‌భిస్తాయి.
 • క్రెడిట్ కార్డ్, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, చెక్కు, ఆటో డెబిట్ స‌దుపాయం ద్వారా ప్రీమియం చెల్లించే అవ‌కాశం ఉంది.
 • మ‌రిన్ని వివ‌రాల కోసం పాల‌సీ బ్రోచ‌ర్‌ను చ‌ద‌వండి . ఆ త‌ర్వాత ఆర్థిక స‌ల‌హాదారుని సూచ‌న‌ల‌తో నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది.

చివరి మాట:

ఇలాంటి పధకాలను పిల్లలు పేరుతో అమ్ముతూ ఉంటారు. పేరుని చూసి పధకాలను కొనుగోలు చేయడం మంచిది కాదు. ఇలాంటి పథకాలలో మదుపు బీమా కలిపి ఉన్నపటికీ బీమా హామీ చాలా తక్కువ, చార్జీల వల్ల రాబడి కూడా తక్కువే. దీని బదులు బీమా కోసం టర్మ్ ప్లాన్, మదుపు కోసం చార్జీలు తక్కువ ఉన్న ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం మేలు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly