హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త...

ఆఫర్‌లో భాగంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ / డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. బ్యాంకు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసినట్లయితే, రూ. 2000 వరకు ఆదా చేసుకోవచ్చు. అధికారిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ. 2000 వరకు ఆదా చేయవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ పొందడానికి, వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో చెల్లింపు చేసేటప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కి సంబంధించిన నిబంధనలు, షరతులను కింద చూద్దాం.

ఆఫర్‌లో భాగంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ / డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ కార్డు లావాదేవీలపై ఫ్లాట్ రూ. 500 తక్షణ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ మే 27, 2020 వరకు చెల్లుతుంది.

ముఖ్యమైన షరతులు:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ / డెబిట్ ఈఎంఐ కోసం: 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను (గరిష్టంగా రూ. 2000) పొందడానికి కనీస చెల్లింపు విలువ రూ. 5000 ఉండాలి. కావున, మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ / క్రెడిట్ కార్డుతో రూ. 20,000 కు షాపింగ్ చేస్తే, అప్పుడు మీరు పూర్తి రూ. 2000 తగ్గింపును పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ కార్డు కోసం : ఫ్లాట్ రూ .500 తగ్గింపుకు కనీస చెల్లింపు విలువ రూ. 13,000 ఉండాలి.

సెలెక్టెడ్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, వాటర్ గీజర్, ఇమ్మర్షన్ రాడ్, రూమ్ హీటర్లు, ఫ్యాన్స్ కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. కావున, దయచేసి ప్రోడక్ట్ ను కొనుగోలు చేసే ముందు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో తనిఖీ చేసుకోండి. అలాగే, పిన్ కోడ్ సర్వీసుబిలిటీకి లోబడి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్పొరేట్ లేదా కమర్షియల్ కార్డులను ఉపయోగించి చేసే లావాదేవీలకు మినహా అన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ / డెబిట్, ఈఎంఐ లావాదేవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అధికారిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, లావాదేవీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఏదేమైనా, ఒక కస్టమర్ క్రెడిట్ కార్డులు, డెబిట్ / క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా రూ. 2000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే డెబిట్ కార్డ్ లావాదేవీలతో ఫ్లాట్ రూ. 500 ను పొందుతారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly