ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.5 శాతం అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. కొత్త వ‌డ్డీ రేట్లు న‌వంబ‌రు16 నుంచి వ‌ర్తిస్తాయి. తాజా పున‌రుద్ధ‌ర‌ణ త‌రువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 రోజుల నుంచి 14 రోజుల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 3.50 శాతం, 15 రోజుల నుంచి 29 రోజుల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 4 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వ్య‌వ‌ధి గ‌ల 4.90 శాతం, 46 రోజుల నుంచి 6 నెల‌ల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 5.40 శాతం, 6 నెల‌ల 1 రోజు నుంచి 9 నెల‌ల లోపు గ‌ల డిపాజిట్ల‌పై 5.80 శాతం 9 నెల‌ల 1 రోజు నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 6.05 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది.

ఒక సంవ‌త్స‌రం, రెండు సంవ‌త్సరాల కాల‌వ్య‌వ‌ధి ఉన్న డిపాజిట్ల‌(రూ.2 కోట్ల కంటే త‌క్కువ‌)పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు:
ఒక సంవ‌త్స‌రం, ఒక సంవ‌త్స‌రం 1రోజు నుంచి రెండు సంవ‌త్స‌రాల‌ కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటును త‌గ్గించింది.
ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై 6.30 శాతం
1సంవ‌త్స‌రం 1 రోజు నుంచి మొద‌లుకుని 2సంవ‌త్స‌రాలు లోపు డిపాజిట్ల‌పై 6.30 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది.

2 నుంచి 10 సంవ‌త్సరాల కాల‌వ్య‌వ‌ధి ఉన్న డిపాజిట్ల‌(రూ.2 కోట్ల కంటే త‌క్కువ‌)పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు:
దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగే డిపాజిట్ల‌పై కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటును త‌గ్గించింది.
2సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 3 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 6.40 శాతం
3సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 5 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 6.30 శాతం
5సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 6.30 శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి గ‌ల సీనియ‌ర్ సిటిజ‌న్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై బ్యాంక్ 4 శాతం నుంచి 6.90 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ఇస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly