భాగ‌స్వామికి ఇంటి అద్దె చెల్లిస్తే హెచ్ఆర్ఏ పొంద‌వ‌చ్చా?

భార్య పేరుతో ఉన్న ఇంటికి అద్దె చెల్లిస్తున్న‌ప్పుడు హెచ్ఆర్ఏ పొంద‌వ‌చ్చా? తెలుసుకుందాం..

భాగ‌స్వామికి ఇంటి అద్దె చెల్లిస్తే హెచ్ఆర్ఏ పొంద‌వ‌చ్చా?

వేత‌న జీవుల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇచ్చే ఒక ముఖ్య‌మైన ప‌న్ను మిన‌హాయింపు హెచ్ఆర్ఏ. దీన్నే ఇంటి అద్దె భ‌త్యం లేదా హౌజ్ రెంట్ అల‌వెన్సు అంటున్నాం. హెచ్ఆర్ఏ గురించి కొన్ని విష‌యాలు… అద్దె ఇంట్లో నివ‌సిస్తే హెచ్ఆర్ఏ కింద ప‌న్ను ఆదా కోసం క్లెయిం చేసుకోవ‌చ్చు, సొంత ఇల్లు ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిం వ‌ర్తించ‌దు, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసుంటే వారికి అద్దె చెల్లించిన‌ట్టుగా ర‌శీదులు లేదా లావాదేవీ చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే త‌ల్లిదండ్రులు వారి ఆదాయంలో దీన్ని చూపించుకోవాల్సి ఉంటుంది, సంవ‌త్స‌రానికి అద్దె రూ.1ల‌క్ష కంటే ఎక్కువ‌గా చెల్లిస్తున్న‌ట్ట‌యితే ఇంటి యాజ‌మాని పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. ఒక వేళ వారికి పాన్ లేక‌పోతే పేరు, చిరునామాతో డిక్ల‌రేష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంత‌మంది మ‌హిళ‌ల పేరుతో ఇంటి రుణం తీసుకుంటే వ‌డ్డీ త‌క్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి వారి పేరుతో ఇంటిని న‌మోదు చేయిస్తారు. అయితే అదే ఇంట్లో నివ‌సిస్తూ భార్య‌కు ఇంటి అద్దె చెల్లిస్తున్న‌ట్లుగా క్లెయిమ్ చేసుకుంటే హెచ్ఆర్ఏ ల‌భిస్తుందా ?తెలుసుకోండి.

అద్దె చెల్లించిన బిల్లులు:

మీరు అద్దె ఇంట్లో నివ‌సిస్దున్న‌ట్ల‌యితే ఇంటి య‌జ‌మానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అద్దె బిల్లులు, స‌రైన ఆధారాలు ఉండాలి. మీ భాగ‌స్వామి పేరు మీద ఉన్న ఇంట్లో నివ‌సిస్తున్న‌ప్ప‌టికీ అద్దె చెల్లిస్తున్న‌ట్లుగా ప‌త్రాలు అవ‌స‌రం.

ఇళ్లు మీ భాగ‌స్వామి పేరు మీదే ఉండాలి:

ఇంటి అద్దె తీసుకుంటున్న‌వారి పేరు మీదే ఇళ్లు క‌చ్చితంగా ఉండాలి. ఆ ఇళ్లు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తి లేదా సొంతంగా కొనుగోలు చేసిన‌దై ఉండాలి. ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 27 ప్ర‌కారం, ఇంటిని త‌మ భాగ‌స్వామి పేరు మీద బ‌దిలీ చేసిన‌ప్పుడు పూర్తిగా వారికి స్వాదీనం చేస్తున్నట్లుగా ఉండాలి. మొద‌ట ఇంటిని త‌మ భాగ‌స్వామి పేరుతో న‌మోదు చేస్తున్న‌ప్పుడు ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌నలు తీసుకోవాలి. ఎలాంటి సంప్ర‌దింపులు లేకుండా ఇంటి ఆస్తిని భాగ‌స్వామికి బ‌దిలీ చేస్తే అది బ‌హుమ‌తి కింద‌కి వ‌స్తుంది. దానిపై వ‌చ్చే ఆదాయం మీ మొత్తం ఆదాయంలోకి క‌లిపి ప‌న్ను లెక్కిస్తారు. అప్పుడు అదే ఇంట్లో ఉంటూ అద్దె చెల్లిస్తే ఆ ఆదాయం కూడా మీ ఆదాయానికి క‌లిపి ప‌న్ను వ‌ర్తిస్తుంది. హెచ్ఆర్ఏ పొందిన‌ప్ప‌టికీ దానికంటే చెల్లించాల్సిన ప‌న్ను ఎక్కువ‌గా ఉంటుంది.

అద్దె ఇంటిలో భాగ‌స్వామ్యానికి వీల్లేదు:

మీరు ఇంటి అద్దె చెల్లిస్తున్న‌ప్పుడు మొత్తం ఇళ్లు లేదా మీరు నివ‌సిస్తున్న గ‌ది మీకోసం కేటాయిస్తున్న‌ట్లుగా ఉండాలి. అద్దె చెల్లించువారు య‌జ‌మానితో పాటు నివ‌సిస్తున్న‌ట్లు ఉండ‌కూడ‌దు. అంటే ఇంట్లో ఇద్ద‌రు భార్య భ‌ర్తలు క‌లిసి ఉండి భాగ‌స్వామి పేరుతో ఉన్న ఇంటికి అద్దె చెల్లిస్తుంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు.

మ‌రి ఎప్పుడు వ‌ర్తిస్తుంది?

అద్దె అల‌వెన్సును పొందేందుకు కొన్నినియ‌మాలు:

  1. ఇల్లు మీ భాగ‌స్వామికి వార‌స‌త్వంగా వ‌చ్చినా లేదా సొంతంగా కొన‌గోలు చేసిన‌దై ఉండాలి.
  2. ఆ ఇంట్లో మీ భాగ‌స్వామితో కాకుండా వేర్వేరుగా నివ‌సిస్తున్న‌ట్లు రుజువు చూపిస్తే హెచ్ఆర్ఏ పొంద‌వ‌చ్చు.
  3. ఇంటి అద్దె చెల్లిస్తున్న‌ట్లు ప‌త్రాలు ఉండాలి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly