బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి చేసిన కేంద్రం

వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి చేసిన కేంద్రం

బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్‌మార్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత‌వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2021 జ‌న‌వ‌రి 15 నుంచి ఈ నిర్ణ‌యం అమ‌లులోకి రానుంది. బంగారు ఆభ‌ర‌ణాలు, బంగారంతో రూపొందించిన క‌ళాఖండాల‌కు హాల్‌మార్క్‌ను త‌ప్ప‌ని స‌రి చేస్తున్న‌ట్లు కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస‌వాన్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు.

హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తు వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల విభాగం 2020 జ‌న‌వ‌రి 15న ఒక నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుందని తెలిపారు. దీని అమ‌లు కోసం స‌రిగ్గా ఏడాది కాలం పాటు గ‌డువు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ లోగా వ‌ర్త‌కులు త‌మ వ‌ద్ద ఉన్న బంగారం స్టాక్‌ను పూర్తిచేసుకోవాల‌ని సూచించారు. నాణ్య‌మైన బంగారం అందించ‌డ‌మే అక్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly