వీలీనం కానున్న‌హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ కంపెనీలు

హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ అనుబంధ కంపెనీలు డీకేఆర్ హెల్త్‌కేర్‌, బీఏసీసీ హెల్త్‌కేర్ విలీనం కానున్నాయి.

వీలీనం కానున్న‌హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ కంపెనీలు

హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ ఎంట‌ర్‌ప్రైజెస్ డీకేఆర్ హెల్త్‌కేర్‌ను, బీఏసీసీ హెల్త్‌కేర్‌లో విలీనం చేసేందుకు ఆమోదం పొందింది. రెండు కంపెనీల‌ బోర్డు స‌భ్యులు ఈ విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

బీఏసీసీ హెల్త్‌కేర్, హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ ప్ర‌త్య‌క్ష అనుబంధ సంస్థ కాగా డీకేఆర్ హెల్త్‌కేర్ బీఏసీసీ హెల్త్‌కేర్ అనుబంధ‌ సంస్థ‌. హెల్త్‌కేర్ గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రైజెస్ క్యాన్స‌ర్ కేర్ సంస్థ‌. దీనికి దేశ‌వ్యాప్తంగా 15 క్యాన్స‌ర్ కేర్ సెంట‌ర్లు ఉన్నాయి. ఇది అడ్వాన్స్‌డ్‌ క్యాన్స‌ర్ కేర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

హెల్త్‌కేర్ గ్లోబ‌ల్‌ షేర్లు ప్ర‌స్తుతం బీఎస్ఈలో 0.35 పైస‌లు పెరిగి రూ.251.85 వ‌ద్ద ట్రేడ‌వుతున్నాయి. కంపెనీలో ప్ర‌మోట‌ర్ల‌కు 24.61%, సంస్థేత‌రుల‌కు 75.39% వాటాలు ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly