పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం ప్ర‌ణాళిక

ద్రవ్యోల్బణాన్ని అదిగ‌మించి రాబడులను అందించే సాధనాల ద్వారా పెట్టుబడి పెట్టాలి

పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం ప్ర‌ణాళిక

పిల్లలకు మంచి విద్యను అందించడం, వారి అభివృద్ధికి సరైన అవకాశం కల్పించడం ప్రతి తల్లిదండ్రుల లక్ష్యం. అందువలన, పిల్లల విద్యకు అవసరమయ్యే డబ్బు కోసం జాగ్రత్తగా ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పిల్లలు కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు దానికి కావలసిన డబ్బుతో సిద్ధంగా ఉండాలి అలాగే అధిక ఫీజులని తలచుకుని మీరు భయపడకూడదు. మీ పిల్లల విద్యకు కావలసిన డబ్బు కోసం ప్రణాళికను రూపొందించుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

సమయాన్ని వృథా చేయకండి:

మీ పిల్లల విద్య కోసం ప్రణాళికను రచించడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యంగా ఉంటుంది. మీ పిల్లలు పుట్టిన సమయం నుంచే వారి భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికను ప్రారంభించడం ఉత్తమం. ఒకవేళ మీ పిల్లలు 18 సంవత్సరాల వయస్సులో కాలేజీకి వెళ్తారని అనుకున్నట్లైతే, వారి అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేయడానికి మీకు దాదాపు రెండు దశాబ్దాల సమయం ఉంటుంది. కంపౌండెడ్ పెరుగుదల ప్రభావం మీరు ఈ లక్ష్యాన్ని సాధించటానికి చిన్న, నెలవారీ సహకారంతో అనుమతిస్తుంది.

ద్రవ్యోల్బణ ప్రణాళిక:

ద్రవ్యోల్బణం కారణంగా, ప్రతి సంవత్సరం ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు పెరుగుతూపోతుంది. 2018 సంవత్సరంలో, ఒక ప్రీమియం బిజినెస్ స్కూల్ రెండు సంవత్సరాల కోర్సు ఫీజును రూ. 21 లక్షలకు పెంచింది. 2008 సంవత్సరంలో ఇదే కోర్సు ఫీజు రూ. 6 లక్షలుగా ఉండేది. అంటే పది సంవత్సరాల కాలంలో సగటున 13 శాతం పెరిగింది. ఇదే విధమైన ద్రవ్యోల్బణ రేటుతో అదే కోర్సు 2028 సంవత్సరంలో రూ. 69 లక్షలకు చేరుకుంటుంది. మీ పిల్లల విద్యా అవసరాలను లెక్కించేటప్పుడు, భవిష్యత్తులో విద్యకు అయ్యే ఖర్చులను అంచనా వేయడం ముఖ్యం.

తక్కువ రాబడినిచ్చే పెట్టుబడులను మానుకోండి:

సాధారణంగా పిల్లల విద్య అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండడమే కాకుండా అధిక ధరల ద్రవ్యోల్బణం కూడా ఉంటుంది. అందువలన మీరు ద్రవ్యోల్బణాన్ని తలదన్నే విధంగా రాబడులను అందించే సాధనాల ద్వారా పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాల పెట్టుబడులు తక్కువ రిస్క్ ను కలిగి ఉండడంతో పాటు అధిక రాబడిని అందిస్తాయి.

చిన్నగా మొదలు పెట్టి, వృద్ధి చేయండి:

లక్ష్య సాధన కోసం మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు, దానిని వృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, మీరు నెలకు రూ. 50,000 సంపాదిస్తూ, అందులో రూ. 10,000 ప్రతినెలా ఆదా చేస్తారనుకుందాం. వచ్చే ఏడాది, మీ ఆదాయం 10 శాతం పెరిగి రూ. 55,000 గా ఉంటే, మీ పొదుపులను 10 శాతం అనగా రూ. 11000 లకు పెంచుకోవాలి. మీ ఆదాయంలో పెరుగుదలకు తగట్టుగా పెట్టుబడిని కూడా పెంచుతూ ఉండాలి.

మీకోసం బీమా తీసుకోండి:

మొదటిగా జీవిత బీమాను కుటుంబానికి రక్షణగా చూడాల్సి ఉంటుంది, అయితే చాలా మంది దీనిని పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. ఒకవేళ ప్రమాద‌వశాత్తు మీరు మరణించినట్లైతే, మీ ఆదాయాన్ని భర్తీ చేయడానికి, అలాగే మీ కుటుంబాన్ని ఆర్ధికంగా రక్షించడానికి జీవిత బీమా ఎంతగానో సహాయపడుతుంది. మీ పిల్లలు వారి జీవిత లక్ష్యాలను సాధించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మీ ప్రస్తుత వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 20 రెట్లు అధికంగా జీవిత బీమా కవరేజ్ ఉండేలా చూసుకోండి. టర్మ్ బీమా పాలసీతో, మీరు అత్యధిక కవరేజ్ ను పొందగలరు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత కల్పించవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly