ఇళ్ల కొనుగోళ్లు త‌గ్గాయి

2017 సంవ‌త్స‌రంలో ఇళ్ల కొనుగోళ్ల‌పై ఆస‌క్తి త‌గ్గింద‌ని పరిశోధ‌న నివేదిక తెలిపింది.

ఇళ్ల కొనుగోళ్లు త‌గ్గాయి

గ‌డిచిన‌ సంవ‌త్స‌రంలో ఇళ్ల కొనుగోళ్లు త‌గ్గుముఖ ప‌ట్టాయి. అంత‌క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 41 శాతం త‌గ్గాయి. నియంత్ర‌ణ ప‌ర‌మైన మార్పులు, వినియోగ‌దారుల సెంటిమెంట్ బ‌ల‌హీన‌ప‌డ‌టం దీనికి కార‌ణంగా భావిస్తున్నారు. స్థిరాస్తి సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చేసిన స‌ర్వే ప్ర‌కారం 2017 సంవ‌త్స‌రంంలో ఇళ్ల అమ్మ‌కాలు ఏడేళ్ల క‌నిష్ఠానికి చేరాయి. 2011 లో అత్య‌ధికంగా 368,568 ఇళ్ల‌ అమ్మ‌కాలు జ‌ర‌గ్గా, గ‌తేడాది 228,072 కి త‌గ్గాయి.

దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాలైన ముంబ‌యి, పూనె, బెంగుళూరు, చెన్నై, హైద్రాబాద్‌, కోల్‌క‌త్తా, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల‌లో నైట్ ఫ్రాంక్ స‌ర్వే నిర్వ‌హించింది. దీని ప్ర‌కారం అంత‌క్రితం ఏడాదితో పోలిస్తే కొత్త గృహాలు 41 శాతం త‌క్కువ‌గా ప్రారంభ‌మ‌య్యాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly