సరికొత్త సీబీఆర్ 150ఆర్ ను ఆవిష్కరించిన హోండా..

బైకు ముందువైపు రెండు సన్నని ఎల్ఈడీ హెడ్ లాంప్ లను, వెనకవైపు టైల్ లాంప్, టర్న్ ఇండికేటర్ లకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు

సరికొత్త సీబీఆర్ 150ఆర్ ను ఆవిష్కరించిన హోండా..

జపాన్ కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా సరికొత్త సీబీఆర్ 150ఆర్ బైకును థాయిలాండ్ లో ఆవిష్కరించింది. మనదేశంలో ఈ బైకు నాన్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 2 లక్షలుగా, అలాగే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షలుగా ఉండనుంది. ఈ బైకు మన దేశ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాక, యమహా ఆర్ 15 వీ3, కేటీఎం ఆర్సీ 200 బైకులకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక సీబీఆర్ 150ఆర్ 2019 బైకు ఫీచర్ విషయానికి వస్తే, మెరుగైన ఏరోడైనమిక్ డిజైన్ కోసం ఒక సన్నని ఫ్రేమ్ ను అమర్చారు. అలాగే బైకు ముందువైపు రెండు సన్నని ఎల్ఈడీ హెడ్ లాంప్ లను, వెనకవైపు టైల్ లాంప్, టర్న్ ఇండికేటర్ లకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇంజిన్ ఉష్ణోగ్రత, గేర్ స్థానం, ఇంధనం వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను దీనికి అమర్చారు.

సీబీఆర్ 150ఆర్ లో 149 సీసీ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 17.1 పీఎస్ పవర్ ని, 14.4 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఆరు గేర్లు ఉంటాయి. దీని ఇంధన ట్యాక్ సామర్థ్యం 12 లీటర్లు. ఈ బైకు గంటకు 135 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించగలదు. దీనిని చాలా బలంగా తక్కువ బరువుండే డైమండ్ ఫ్రేమ్ పై నిర్మించారు. ఈ బైకులో ప్రీలోడ్ ఎడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్స్ ను అమర్చారు, ఈ సెగ్మెంట్ కి సంబంధించిన బైకుల్లో ఈ ఫీచర్ ను తీసుకురావడం ఇదే మొదటిసారి. అలాగే వెనుక వైపు మోనోషాక్ ను, 17 అంగుళాల అల్లోయ్ వీల్స్ ను అమర్చారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly