వీడియో స్ట్రీమింగ్‌లో హాట్‌స్టార్‌‌దే అగ్ర‌స్థానం

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియోలు మెట్రో న‌గ‌రాల‌లో ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతున్నాయి

వీడియో స్ట్రీమింగ్‌లో హాట్‌స్టార్‌‌దే అగ్ర‌స్థానం

భార‌త్‌లో ప్ర‌ఖ్యాతి గాంచిన ఓటీటీ - (ఓవర్‌ ద టాప్‌) వీడియో ప్లాట్‌ప్లామ్‌ల‌లో హాట్ స్టార్ ముఖ్య‌మైన‌ది. కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం వీడియా స్ట్రీమింగ్ సేవ‌ల‌లో హాట్‌స్టార్ మొద‌టి స్థానంలో ఉండ‌గా త‌రువాత స్థానాల‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీ లివ్‌, నెట్‌ఫ్లిక్స్‌, వూట్‌, జీ5, ఆల్ట్‌ బాలాజీ, ఎరోస్‌ నౌ ఉన్నాయి. ప్ర‌తి ప్లాట్‌ఫార‌మ్‌పై స‌భ్య‌త్వం తీసుకున్న‌ చందాదారుల జాబితాను, ప‌ర్సెంటేజ్ ప్ర‌కారం ప‌రిశీలిస్తే నెట్‌ఫిక్స్ 4వ స్థానంలో ఉంది. స్థానిక ఓటీటీ ప్లేయ‌ర్లైన సోనీలివ్‌, పూట్‌, జీ5, ఎరోస్ నౌ వంటివి విదేశీ సంస్థ‌లైన అమెజాన్ వీడియో నెట్‌ఫ్లిక్స్‌తో పోటిప‌డుతున్నాయి.

మెట్రో న‌గ‌రాల‌లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియోలు అధికంగా ప్ర‌సిద్ధి చెందాయి. 5 ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల‌లో 65 శాతం మంది వినియోగ‌దారులు ఈ ప్లాట్‌ఫార‌మ్‌లను ఉప‌యోగిస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువేన‌ని నివేదిక వెల్ల‌డించింది.

సోనీ లివ్‌, టైర్‌-I న‌గ‌రాల‌లో అధికంగా స్కోర్ చేస్తుంది. దాదాపు 40 శాతం మంది సోనీ లివ్‌ వినియోగ‌దారులు టైర్‌-I న‌గ‌రాల‌లో ఉన్నారు. హాట్‌స్టార్‌లో స‌భ్యత్వం తీసుకోకుండా ఉప‌యోగించే వినియోగ‌దారుల సంఖ్య కూడా ఎక్కువే. క్రికెట్ మ్యాచ్‌ల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం, ఇత‌ర టీవీ ఛాన‌ళ్ళ కంటెట్‌ను ప్ర‌సారం చేసేందుకు వారితో భాగ‌స్వామ్యం వంటివి హాట్‌స్టార్‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాయి. స‌ర్వే ప్ర‌కారం 56 శాతం మంది హాట్‌స్టార్ వినియోగ‌దారులు మెట్రో న‌గ‌రాల‌కు చెందిన‌వారే.

స్టార్ట్ టీవీలో కంటెట్‌ను చూసే వారిలో 27 శాతం ఎరోస్‌ నౌ వినియోగ‌దారులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబోయే ‘కొత్త ఆపిల్ టీవీ + స‌ర్వీసెస్‌’ కోసం ఆపిల్‌తో భాగస్వామిగా కుదుర్చుకున్న‌ ఏకైక భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఎరోస్ నౌ. అదేవిధంగా 9 శాతం వినియోగ‌దారులు వారంలో 21 గంట‌ల‌కు పైగా ఈ ప్లాట్ ఫార‌మ్ ద్వారా వీక్షిస్తున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

భారతదేశంలో ఓటీటీ వినియోగదారులలో, రిలయన్స్ జియో అత్యంత ప్రజాదరణ పొందిన నెట్‌వర్క్, దీని తరువాత స్థానంలో ఎయిర్‌టెల్ వొడాఫోన్-ఐడియా ఉన్నాయ‌ని స‌ర్వే ద్వారా తెలుస్తుంది.

దేశం మొత్తం ఈ వీడియో సేవలను వినియోగిస్తున్న 89శాతం మంది… 35 ఏళ్లలోపు వారేనని ఈ సర్వే తేల్చింది. ఇందులో 16-24 వయసు వారు 25-35 ఏళ్ల వయసు వాళ్లు సమానంగా ఈ సేవలను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. వీటిని చూస్తున్న వాళ్లలో అత్యధికంగా పురుషులే (79 శాతం) కావడం గమనార్హం. ఇక ఈ సేవలను వినియోగిస్తున్న వారిలో అత్యధికంగా 55 శాతం మంది ఐదు మెట్రో నగరాలకు చెందిన వారే కావడం గమనార్హం. మిగిలిన 36శాతం మంది యూజర్లు ప్రథమ స్థాయి నగరాల (టైర్‌-1)కు చెందిన వారు కావడం గమనార్హం.

ఓటీటీ సేవల్లో హాట్‌స్టార్‌ అగ్రస్థానంలో నిలిచిందని సర్వే పేర్కొంది. హాట్‌స్టార్‌ తర్వాతి స్థానాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీ లివ్‌, నెట్‌ఫ్లిక్స్‌, వూట్‌, జీ5, ఆల్ట్‌ బాలాజీ, ఎరోస్‌ నౌ ఉన్నాయి. వీటిలో ప్రకటన ఆధారిత సర్వీసులకే ఎక్కువ ఆదరణ ఉందని, సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత (ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌) మార్కెట్‌కు కూడా అంతకంతకూ ఆదరణ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. తక్కువ ధరకే మొబైల్ డేటా, స్మార్ట్‌ఫోన్లు లభిస్తుండడం వీటి సేవల్లో వృద్ధికి కారణమని కౌంటర్‌ పాయింట్‌ సీనియర్‌ అనలిస్ట్‌ హనీశ్‌ భాటియా తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly