రుణాల‌పై ఎమ్‌సీఎల్ఆర్ ప్ర‌భావం ఎంత‌?

రిజ‌ర్వుబ్యాంకు పాల‌సీలో భాగంగా త‌గ్గించిన రెపోరేటు రిటైల్ మార్కెట్ల‌లో ప్ర‌తిబింబించాలంటే కొంత కాలం ప‌డుతుంది.

రుణాల‌పై ఎమ్‌సీఎల్ఆర్ ప్ర‌భావం ఎంత‌?

ఈ నెలలో మొదటి వారంలో, కనీసం ఐదు అగ్ర బ్యాంకులు నిధుల ఆధారిత రుణ రేటు తగ్గించాయి. ఫ్లోటింగ్ రేటు విధానంలో రుణం తీసుకునే వారికి ఎమ్‌సీఎల్ఆర్ బెంచ్మార్క్ రేటు అవుతుంది. కొటాక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు ఎమ్సీఎల్ఆర్ ను 0.05-0.1 శాతం వ‌ర‌కూ త‌గ్గించాయి. రిజర్వుబ్యాంకు రెపో రేటును తగ్గించిన నెలలో, వాణిజ్య బ్యాంకులు కూడా త‌మ ఎమ్‌సీఎల్ఆర్ ను త‌గ్గించాయి. గ‌త స‌మీక్ష‌లో రిజ‌ర్వుబ్యాంకు రెపో రేటును 0.25శాతం త‌గ్గించింది. ప్ర‌స్తుతం రెపో రేటు 6.25 శాతం. రిజ‌ర్వు బ్యాంకు రేటు త‌గ్గించిన వెంట‌నే దీర్ఘకాలిక వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రిజ‌ర్వుబ్యాంకు త‌గ్గించిన రేటు రిటైల్ మార్కెట్ల‌లో రావాలంటే కొంతకాలం ప‌డుతుంది. ఆర్బీఐ రేటు తగ్గించిన వెంట‌నే హోల్‌సేల్ మార్కెట్‌లో రేటు త‌గ్గుతుంది. రిటైల్ మార్కెట్‌లో కొంత మేర త‌గ్గుతుంద‌ని నిపుణులు అంటున్నారు.ఎమ్‌సీఎల్ఆర్ ఉపాంత ప్రాతిపదికన ఉన్నందున, ఇది బ్యాంకు నిధుల గణన ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎమ్‌సీఎల్ఆర్ త‌గ్గిన‌పుడు డిపాజిట్ రేట్లు స్వల్పంగా తగ్గుతాయి. కొటాక్ మహీంద్రా బ్యాంకు ఆరు నెలల ఎమ్‌సీఎల్ఆర్ ను 0.05 శాతం త‌గ్గించి 8.80 శాతానికి , ఒక సంవత్సర ఎమ్‌సీఎల్ఆర్ ను 0.05 శాతం త‌గ్గించి 9.00 శాతానికి సవరించింది గృహ‌రుణాల‌పై వ‌డ్డీరేటు ను ఆరునెల‌ల ఎమ్‌సీఎల్ఆర్ ఆధారంగా లెక్కిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు ఒక సంవత్సరం ఎమ్‌సీఎల్ఆర్ ను 0.10 శాతం త‌గ్గించి 8.75 శాతం నుంచి 8.65 శాతానికి స‌వ‌రించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం ఎమ్‌సీఎల్ఆర్ ను 8.55% నుంచి 8.45% కు త‌గ్గించింది. ఎస్‌బీఐ గృహ‌రుణాల‌పై ఎమ్‌సీఎల్ఆర్ పై వ‌సూలు చేసే స్ప్రెడ్ ను త‌గ్గించింది. అయితే ఎమ్‌సీఎల్ఆర్ ను త‌గ్గించ‌లేదు. గృహ రుణాలు బెంచ్మార్క్ రేటు, బ్యాంకులు తీసుకునే స్ప్రెడ్ ఆధారంగా ఉంటాయి.

మీరు ఇప్పటికే ఉన్న గృహ రుణ గ్రహీత అయితే, ఎమ్సీఎల్ఆర్ లేదా స్ప్రెడ్ త‌గ్గింపు ప్రభావం వెంట‌నే ఉండదు. ఏప్రిల్ 2016 లో ఎమ్‌సీఎల్ఆర్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత, ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఎమ్‌సీఎల్ఆర్ కాల‌ప‌రిమితికి స్థిరంగా ఉంటాయి. అందువల్ల గృహ‌ రుణ ఎమ్‌సీఎల్ఆర్ ఆరునెలల ఎమ్‌సీఎల్ఆర్ కు అనుసంధానించి ఉంటే, ఆరు నెలల పూర్తయిన తర్వాత మాత్రమే మార్పు ఉంటుంది. ఒక సంవత్సర ఎమ్‌సీఎల్ఆర్ తో అనుసంధానం ఉన్నట్లయితే, ఒక సంవత్సరం తర్వాత రుణరేటు రీసెట్ అవుతుంది.

గృహ రుణ గ్రహీతలు త‌మ రుణాల‌పై స్ప్రెడ్ జీవితకాలం వ‌ర్తించే విధానం అయితే మ‌ధ్య‌లో బ్యాంకులు స్ప్రెడ్ త‌గ్గించినా రుణ‌గ్ర‌హీత‌లు ఆ త‌గ్గింపు పొంద‌లేరు. కొత్త రుణగ్రహీత అయితే ఇది వ‌ర్తించి రుణంపై వ‌ర్తించే రేటు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు మీరు స్ప్రెడ్స్ లేకుండా ఎమ్‌సీఎల్ఆర్ తో రుణాలు ఇస్తాయి. ఇటీవలే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పొదుపు ఖాతా, స్వల్పకాలిక రుణాలను రెపో రేటుతో జత చేసింది. ఇతర బ్యాంకులు ఈ విధానాన్ని అనుసరించినట్లయితే, ఎమ్‌సీఎల్ఆర్ పై మరింత ప్రభావాన్ని చూడొచ్చు. అయితే ఇది స్వల్పంగా ఉంటుంది. ఎమ్‌సీఎల్ఆర్ లో త‌గ్గింపు ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లలోనూ మార్పు తెస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly