స్టాక్ మార్కెట్ల ప‌త‌నం నేప‌థ్యంలో సిప్‌లు ఎలా ఉండ‌నున్నాయి?

సిప్‌ల ద్వారా ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం అంటే ప‌రోక్షంగా స్టాక్‌లు కొనుగోలు చేయ‌డం

స్టాక్ మార్కెట్ల ప‌త‌నం నేప‌థ్యంలో సిప్‌లు ఎలా ఉండ‌నున్నాయి?

గత కొన్ని సంవత్సరాలుగా, రిటైల్ పెట్టుబ‌డుదారులు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం (సిప్) ద్వారా స్టాక్స్‌లో చేసిన పరోక్ష పెట్టుబడులు పెరిగాయి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) స్టాక్ పెట్టుబ‌డుల‌ కంటే మించిపోయాయి. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో ఇది కొనసాగుతుందా? లేదా?

సిప్‌ల ద్వారా ఎంత పెడుతున్నారు?

2019-20లో ఒక‌ ట్రిలియన్ రూపాయ‌ల ఎక్కువ పెట్టుబ‌డులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి సిప్‌ల ద్వారా వ‌చ్చాయి. సిప్‌ అంటే ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్ పథకంలో కొంత‌ పెట్టుబడి పెట్టబడుతుంది. సిప్‌లలో ఎక్కువ భాగం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలపై నడుస్తాయి, ఈ పెట్టుబ‌డులు స్టాక్‌ల‌లో పెడ‌తాయి. అంటే ప‌రోక్షంగా స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు లెక్క. 2019-20 నాటికి, సిప్‌ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలోకి ప్ర‌తి నెల రూ.8,000 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. అంత‌కుముందు ఏడాదిలో నెల‌కు రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ కూడా వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ఎఫ్ఐఐ పెట్టుబ‌డుల‌తో పోలిస్తే…?

ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2020 మధ్య, సిప్‌ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో సుమారు రూ. 3.04 ట్రిలియన్ల పెట్టుబడులు వ‌చ్చాయి. వీటిలో ఎక్కువ భాగం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి , మిగ‌తావి స్టాక్స్‌లోకి వెళ్తాయి. ఇదే కాలంలో ఎఫ్‌ఐఐలు కేవలం రూ. 87,403 కోట్ల విలువైన స్టాక్‌లను కొనుగోలు చేశాయి. రూ. 55,703 కోట్ల విలువైన ఈ స్టాక్‌లను 2016-17లో కొనుగోలు చేశారు. 2016-17 తరువాత, భారతీయ స్టాక్లలో వారి పెట్టుబడులు ఒక్కసారిగా పడిపోయాయి. కంపెనీ ఆదాయాలలో నెమ్మదిగా వృద్ధి ఉన్నప్పటికీ, గత మూడేళ్ళలో, రిటైల్ సిప్ ద్వారా స్టాక్‌ల‌లోకి వచ్చే డబ్బు స్టాక్ మార్కెట్‌ను నడిపించిందని చెప్పవ‌చ్చు.

సిప్‌లు మార్కెట్ల‌ను ఎలా న‌డిపించాయి?

2015-16లో బీఎస్ఈ సెన్సెక్స్ 30 స్టాక్‌ల‌ ఆదాయ నిష్పత్తి ధర 20.2గా ఉంది. 2019-20లో ఇది 26.4 కి పెరిగింది. గత 12 నెలల్లో కంపెనీ ప్రస్తుత స్టాక్ ధరను ఒక్కో షేరుకు వచ్చే ఆదాయాల ద్వారా విభజించడం ద్వారా ఆదాయ నిష్పత్తి వ‌స్తుంది. ప్రాథమికంగా, సిప్‌ డబ్బు కంపెనీ ఆదాయాలతో సంబంధం లేకుడా స్టాక్ ధరలను పెంచింది.

ఎంత మంది సిప్‌లో క్ర‌మంగా పెట్టుడులు పెడుతున్నారు?

మార్చి 2020 నాటికి మొత్తం సిప్‌ల సంఖ్య 31.2 మిలియ‌న్లు (ఒక‌రికి ఒక‌టి కంటే ఎక్కువ సిప్‌లు కూడా ఉండ‌వ‌చ్చు). మార్చి 2019 తో పోలిస్తే 18.6 శాతం పెరిగాయి. అయితే ఫిబ్ర‌వ‌రి, మార్చిలో స్టాక్ మార్కెట్‌లు ప‌డిపోవ‌డంతో సిప్ పెట్టుబ‌డులు త‌గ్గిపోయాయి. జ‌న‌వ‌రిలో రూ.3.25 ట్రిలియ‌న్ల పెట్టుబ‌డులు రాగా, మార్చిలో రూ.2.4 ట్రిలియ‌న్ల‌కు ప‌డిపోయాయి.

సిప్ ఖాతాలు తిరిగి పెరుగుతాయా?

సిప్‌ ఖాతాల సంఖ్య జనవరి చివ‌రి నుంచి మార్చి-ముగింపు మధ్య 30.4 మిలియన్ల నుంచి 31.2 మిలియన్లకు పెరిగింది. ఏప్రిల్ వివ‌రాలు విడుదలైన తర్వాత సిప్‌లు పెరిగాయా, త‌గ్గుతున్నాయా తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ పతనం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్ పథకాలను మూసివేయడం క‌చ్చితంగా సిప్‌ పెట్టుబడిదారులను కలవరపెడుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly