బ్లాక్‌చైన్‌తో భ‌ద్రంగా డిజిట‌ల్ బ్యాంకింగ్

బ్లాక్‌చైన్‌ డేటా బేస్ హ్యాక్ చేయాలంటే హ్యాక‌ర్లు కొత్త ప‌ద్థ‌తులు క‌నుగొనాల్సిందే..

బ్లాక్‌చైన్‌తో  భ‌ద్రంగా డిజిట‌ల్ బ్యాంకింగ్

డిజిట‌ల్ లావాదేవీల్లో న‌గ‌దు పంపించేవారి నుంచి పొందేవారికి చేరేందుకు కొన్ని సంద‌ర్భాల్లో ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంటుంది. డిజిట‌ల్ బ్యాంకింగ్ అందించే సేవ‌ల్లో ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న ఒక స‌మ‌స్య‌. దీనికి కార‌ణం కేంద్రీకృత (సెంట్ర‌ల్) డేటాబేస్ లో స‌మాచారం నిక్షిప్త‌మై ఉంటుంది. ఏదైనా లావాదేవీ చేయాలంటే ఒక వైపువారి నుంచి వ‌చ్చిన రిక్వ‌స్ట్ సెంట్ర‌ల్ డేటాబేస్ కు వెళ్లి అంతా స‌రిపోతే మ‌రో వైపు వారితో లావాదేవీ జ‌రుగేందుకు అనుమ‌తిస్తుంది. ఇక్క‌డ స‌మాచారం అంతా ఒకే డేటా బేస్ లో ఉండ‌టం వ‌ల్ల లావాదేవీలు ఆల‌స్యం అవుతుంటాయి. దీనికి ప‌రిష్యారంగా వికేంద్రీకృత (డీ సెంట్ర‌ల్) డేటాబేస్ విధానాన్ని చెప్ప‌వ‌చ్చు.

దాచేందుకు కుద‌ర‌దు

వికేంద్రీకృత (డీ సెంట్ర‌ల్) డేటాబేస్ వ్య‌వ‌స్థ‌తో అంద‌ర‌కీ ఒక‌టి కాదు… ఒక్కొక్క‌రి ఒక‌టి… డేటాబేస్… అది కూడా డేటా అప్‌డేట్ ప్ర‌తీ ఒక్క డేటాబేస్ లోనూ జ‌రుగుతుంది. అంటే ఒక డేటాబేసే లో ఏదైనా జిమ్మిక్కు చేస్తే ఆ లావాదేవీలో ఉన్న‌ ఇత‌ర పార్టీల డేటాబేస్ అప్‌డేట్ అయిపోతుంది. ఇక్క‌డ దాచేందుకు సాధ్యం కాదు.

ఒక‌ ఉదాహ‌ర‌ణతో బ్లాక్ చైన్ లో జ‌రిగే లావాదేవీల గురించి తెలుసుకుందాం.

మీరు ఒక ఇంటిస్థ‌లం కొనుగోలు చేశార‌నుకుందాం. అప్పుడు విక్ర‌యించిన వారు ఆ స్థ‌లం మీకు అమ్మిన‌ట్లుగా ప‌త్రాల‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. అవే వివ‌రాలు కొనుగోలు చేసిన‌ మీ ద‌గ్గ‌ర ఉంటాయి. మీకు అమ్మిన వారి ద‌గ్గ‌ర నుంచి మీ పేరు మీద‌కు మారిన‌ట్లు ఉంటుంది. ఇందులో ఏ ఒక్క‌రు ఈ వివ‌రాల‌ను ఏక‌ప‌క్షంగా మార్చ‌లేరు. ఒక వేళ మార్పుచేస్తే ఆ విష‌యం మిగిలిన డేటా బేస్ ల్లో అప్‌డేట్ అయిపోతుంది. అంటే ఆ స్థ‌లం ఇంకెవ్వ‌రికి విక్ర‌యించేందుకు కుద‌ర‌దు. ఇది భ‌ద్ర‌తకు సంబంధించిన అంశం. ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌డానికి ప‌ట్టే స‌మ‌యం కూడా బ్లాక్ చైన్ విధానంలో వేగంగా అవుతుంది.

హ్యాక‌ర్ల‌కు బ్లాకే

డేటా బేస్ హ్యాక్ చేసేందుకు హ్యాక‌ర్ల‌కు కొత్త ప‌ద్థ‌తులు క‌నుగొనాల్సి ఉంటుంది. సాధార‌ణంగా అయితే ఒక్క సెంట్ర‌ల్ డేటాబేస్ ను హ్యాక్ చేస్తే చాలు ఇప్పుడు అన్ని డేటాబేస్ ల‌ను (బ్లాక్) ల‌ను హ్యాక్ చేయాల్సిందే. ఆ బ్లాక్‌ల‌ను హ్యాక్ చేయాలంటే వాళ్ల మైండ్ బ్లాక్ అయిపోద్ది.

ఈ సాంకేతికత ‘డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జ‌ర్’ అనే అంశంతో ప‌ని చేస్తుంది. అంటే అంద‌రికీ ఒకే స‌మాచారం, మార్పులు జ‌రిగితే అంద‌రికీ తెలియ‌డం. బ్లాక్ చైన్ లో ఒక సారి డేటా నింపిన‌ త‌ర్వాత దాన్నిమార్చ‌లేం. ఏవైనా చేర్పులు చేసేందుకు వీలుంటుంది. ఈ విధానంలో చేసిన చేర్పుల‌కు సంబంధించిన స‌మాచారం, ఆ ముందు జ‌రిగిన లావాదేవీ త‌దిత‌ర వివ‌రాల‌న్నీ రికార్డు అవుతుంటాయి. డేటాకు భ‌ద్ర‌త ఉంటుంది. డేటాలో స‌వ‌ర‌ణ జ‌రిగితే హ్యాష్ లు వాటిని తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

భ‌విష్య‌త్తులో బ్లాక్ చైన్

బ్లాక్ చైన్ సాంకేతిక‌త‌ను ఇంట‌ర్నెట్ లో ఏర్ప‌డిన నూత‌న శ‌కంగా చెప్పాలి. 2024 నాటికి గ్లోబ‌ల్ బ్లాక్ చైన్ టెక్నాల‌జీ మార్కెట్ విలువ యూఎస్ 20 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 58.7 శాతం (సీఏజీఆర్ )తో వృద్ధి చెందే అవ‌కాశం ఉండొచ్చ‌ని కొన్ని ప‌రిశోధ‌న సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. 2008 లో బ్లాక్ చైన్ ద్వారా ఆవిష్కృత‌మైన బిట్ కాయిన్ ను డిజిట‌ల్ గోల్డ్ అనేవారు. ప్ర‌స్తుతం బ్లాక్ చైన్ బిట్ కాయిన్ కు మించి ఎన్నో ప్ర‌యోజాల‌ను చేకూరుస్తుంద‌ని తెలిసింది. బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో నోట్లను వినియోగించే అవ‌స‌ర‌మే లేక‌పోవ‌చ్చా? బ్యాంకులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతుందా? వేచి చూడాల్సిందే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly