ఎన్ని మ్యూచువల్ ఫండ్లు ఉండాలి?

పోర్టుఫోలియో పరిమాణం, వ్యక్తిగత అవ‌స‌రాల అనుగుణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి

ఎన్ని మ్యూచువల్ ఫండ్లు ఉండాలి?

మ‌న‌లో చాలా మంది అనేక మ్యూచువల్ ఫండ్లు కలిగి ఉంటారు. వెయ్యి రూపాయ‌ల‌ సిప్‌తో ఐదు ఫండ్ల‌ను ప్రారంభిస్తారు లేదా కొత్త కొత్త ఫండ్ల కోసం చూస్తుంటారు. కొంత‌కాలానికి నిరాశాజనకంగా ఉన్న‌ సిప్‌ను నిలిపివేస్తారు, పాత ఫండ్ల‌లో పెట్టుబడులు కొన‌సాగించ‌రు. ఒకే వర్గానికి చెందిన ఫండ్ల వ‌ల్ల కొన్ని సంవత్సరాల తరువాత ఫోర్ట్‌ఫోలియో అర్థంకాని స్థితిలో ఉంటుంది. ఒక వేళ మీకు ఇదే స‌మ‌స్య అయితే ఫోర్ట్‌ఫోలియో కొన్ని సులభ ప‌ద్ధతుల‌లో అనుకూలంగా ఎలా మార్చుకోవ‌చ్చో చూద్దాం. మీ ద‌గ్గ‌ర 6 మ్యూచువ‌ల్ ఫండ్లు ఉన్నాయ‌నుకుందాం. వేరు వేరు ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు వీలుగా వివిధ‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను మీరు ఎంచుకోవ‌చ్చు. ఒక ల‌క్ష్యంకోసం మూడు ఫండ్ల‌నూ ఎంచుకోవ‌చ్చు. ఈ మూడు ఫండ్ల ద్వారా రెండు ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం సాధ్య‌మేనా? ఫ‌స్ట్ ఇన్‌, ఫ‌స్ట్ ఔట్ రూల్ ప్ర‌కారం వేరు వేరు ల‌క్ష్యాల‌కు వేరు వేరు కాలావ‌ధులు ఉంటాయి కాబ‌ట్టి అన్ని ల‌క్ష్యాల‌కు అవే ఫండ్ల‌ను ఉప‌యోగించ‌డం సాధ్య‌మే.

ఒక ల‌క్ష్యానికి మూడు ఫండ్లు ఎందుకు ఉండాలి? ఒక‌టి రెండు ఫండ్ల‌కు ఎందుకు త‌గ్గించ‌కూడ‌దు? ఇది ఫోర్ట్‌ఫోలియో ప‌రిమాణానికి సంబందించిన‌ది. మీ ద‌గ్గ‌ర రూ.10 ల‌క్ష‌లు ఉంటే అంత మొత్తాన్ని ఒకే ఫండ్‌లో పెడ‌తారా లేదా విభ‌జిస్తారా? ఒక‌వేళ కోటి రూపాయిలు ఉంటే ఏమి చేస్తారు?

స్టెప్‌-1:

 1. నిర్ధిష్ట ల‌క్ష్యాల‌ను క‌లిగిఉండాలి.
 2. ప్ర‌తి ల‌క్ష్యానికి ఈక్వీటీ ఫండ్ల‌లో, స్థిర ఆదాయాన్నిచ్చే ఫండ్ల‌లో ఎంతెంత మ‌ద‌పు చేస్తారో నిర్ణ‌యించుకోవాలి.
 3. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈక్విటీ కేటాయింపులు ఏవిధంగా ఉండాలో నిర్ణ‌యించుకోవాలి.
 4. ఈక్వీటీ పోర్టుఫోలియోను నిర్ణ‌యించుకోవాలి.

70 శాతం లార్జ్ క్యాప్ ఫండ్ల‌లోనూ మిగిలిన‌ది రిస్క్ శాతం ఆదారంగా ఇత‌ర ఫండ్ల‌లోనూ పెట్టుబ‌డి పెట్ట‌డం మంచింది. లార్జ్ క్యాప్లో సాదార‌ణంగా రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది.

స్టెప్‌-2: ఫోర్ట్‌ఫోలియో పరిమాణం, వ్యక్తిగత సౌలభ్య స్థాయి ఆధారంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి.

ఒక‌సారి ఏ మార్కెట్ క్యాప్‌కు సంబంధించిన ఫండ్ల‌లలో మ‌దుపు చేయాలో నిర్ణ‌యించుకున్నాక‌ అవసరమైన ఈక్విటీ ఫండ్ల సంఖ్య నిర్ణయించుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ వ‌ద్ద రూ. 10 ల‌క్ష‌లు ఫోర్ట్‌ఫోలియో ఉంటే దానిని మూడు ఫండ్ల‌గా విభ‌జించ‌వ‌చ్చు. ఒక వేళ ఈ ఫోర్ట్‌ఫోలియో రూ.1 కోటికి పెరిగితే అప్పుడు మూడు ఫండ్ల‌ను క‌లిగి ఉండ‌చ్చు. అయితే రూ.5 వేలను 5 సిప్‌లుగా విభ‌జించి ప్రారంభిస్తే అది పెద్ద స‌మ‌స్య అవుతుంది. రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఒకే మ్యూచువ‌ల్ ఫండ్‌గా కొన‌సాగించ‌వ‌చ్చు. అందువ‌ల్ల రూ.5 వేలు ఒకే ఫండ్‌గా పెట్టుబ‌డి పెట్టాలి. అంత‌కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టాలంటే మ‌రొక ఫండ్‌ను క‌లుపుకోవ‌చ్చు.

ఈక్వీటీ ఫండ్ల‌లో నెల‌వారిగా రూ. 10 వేల కంటే త‌క్కువ పెట్టుబ‌డి పెడితే ఒకే ఫండ్‌గా పెట్ట‌వ‌చ్చు.రూ.25 ల‌క్ష‌ల కంటే త‌క్కువ మ‌దుపు చేసేవారు రెండు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. అంత‌కంటే ఎక్కువ అయితే రిస్క్‌ను త‌గ్గించుకునేందుకు మూడ‌వ ఫండును తీసుకోవ‌చ్చు. రూ.1 కోటి చేరుకుంటే మీ సౌల‌భ్యం ఆధారంగా నాలుగ‌వ ఫండ్‌ను కూడా తీసుకోవ‌చ్చు.

స్టెప్‌-3: ప‌్ర‌తి ఫండ్ స్వ‌భావం నిర్ణ‌యించుకోవాలి

ఫోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఈక్వీటీ ఫండ్లు ఉండాలో నిర్ణ‌యించుకున్న త‌రువాత వాటి స్వ‌భావాన్ని నిర్ణ‌యించాలి. వివిధ ర‌కాల కాంబినేష‌న్‌ల‌లో ఫండ్ల‌ను తీసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంది. 3 ఫండ్ల పోర్టిఫోలియోకి త‌గినట్లుగా కొన్ని ర‌కాల కాంబినేష‌న్‌లు ఇప్పుడు చూద్దాం.

కాంబినేష‌న్‌-1:

 • లార్జ్ క్యాప్‌
 • ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్ (ప్రారంభంలో బ్యాలెన్స్ ఫండ్‌)
 • మిడ్ క్యాప్‌

కాంబినేష‌న్‌-2:

 • లార్జ్ క్యాప్‌
 • మిడ్ క్యాప్‌
 • స్మాల్ క్యాప్‌

కాంబినేష‌న్‌-3:

 • ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్
 • ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్
 • మిడ్ క్యాప్‌

కాంబినేష‌న్‌-4:

 • ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్
 • బ్యాలెన్స్‌డ్ అడ్‌వాన్‌టేజ్‌
 • మిడ్ క్యాప్‌

కాంబినేష‌న్‌-5:

 • ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్
 • వేల్యు ఓరియంటెడ్‌
 • మిడ్ క్యాప్‌

మీరు మీ సొంత‌గా కాంబినేష‌న్‌ల‌ను నిర్మించుకోవ‌చ్చు. పైన తెలిపిన‌వి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. లార్జ్ క్యాప్ ఫండ్ల స్థానంలో ఇండెక్స్ ఫండ్ల‌ను కూడా ఉంచ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly