మార్జిన‌ల్ రిలీఫ్ అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారు?

రూ.2కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న‌వారికి స‌ర్‌ఛార్జ్ పెంచుతున్న‌ట్లు బ‌డ్జెట్‌లో వెల్ల‌డించారు

మార్జిన‌ల్ రిలీఫ్ అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారు?

వ్య‌క్తులు చెల్లించవలసిన మొత్తం పరిమితి కంటే ఎక్కువ ఆదాయాన్ని మించకుండా మార్జిన‌ల్ రిలీఫ్ ఉంటుంది… ప‌న్ను చెల్లించే ఆదాయం రూ.50 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉంటే స‌ర్‌ఛార్జ్ 10 శాతం ఉంటుంది. అదే కోటి నుంచి రూ.2 కోట్ల వ‌ర‌కు ఉంటే 15 శాతంగా ఉంటుంది.

కేంద్ర బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న‌వారికి స‌ర్‌ఛార్జ్ పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. స‌ర్‌ఛార్జ్ అనేది మొత్తం ప‌న్ను చెల్లించే ఆదాయంపై వేసే ట్యాక్స్. దీని నుంచి వ‌చ్చే ఆదాయం నేరుగా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందుతుంది.

ఇంత‌కుముందు రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం క‌లిగిన‌వారు 15 శాతం స‌ర్‌ఛార్జ్ చెల్లించేవారు. ఈ ఏడాది దానిని 25 శాతానికి పెంచారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం క‌లిగిన‌వారికి ఇది వర్తిస్తుంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ‌గా ఉంటే 37 శాతం చెల్లించాలి

ఇక్క‌డ మ‌రో రెండు ఆదాయ ప‌న్ను శ్లాబులపై ఈ స‌ర్‌ఛార్జ్ వ‌ర్తిస్తుంది. అది వ్య‌క్తులు రూ.50 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఉన్న‌వారు 10 శాతం , కోటి నుంచి రూ.2 కోట్ల ఆదాయం ఉన్న‌వారు 15 శాతం స‌ర్‌ఛార్జ్ చెల్లించాలి.

మార్జిన‌ల్ రిలీఫ్‌
ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, ప‌న్ను ఆదాయం ప‌రిమితికి మించి ఉండి స‌ర్‌ఛార్జ్ చెల్లించేవారికి మార్జిన‌ల్ రిలీఫ్ ఉంటుంది. అయితే ప‌రిమితికి మించి ఉన్న‌ నిక‌ర ఆదాయం స‌ర్‌ఛార్జ్ కంటే త‌క్కువ‌గా ఉండాలి.

ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వ్య‌క్తి ఆదాయం ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.51 ల‌క్ష‌లు ఉంటే 10 శాతం స‌ర్‌ఛార్జ్ ప‌డుతుంది. (రూ.50 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు 10 శాతం స‌ర్‌ఛార్జ్) . అన్ని మిన‌హాయింపులు పోగా రూ.13,42,500 ప‌న్ను ప‌డుతుంది . స‌ర్‌ఛార్జ్ రూ.1,34,250 గా ఉంటుంది. అదే ఆదాయం రూ.50 ల‌క్ష‌ల ఉంటే ప‌న్ను రూ.13,12,500 ఉంటుంది. అద‌నంగా రూ. ల‌క్ష‌కు ప‌న్ను రూ.164250 అద‌నంగా ప‌డుతుంది.

కాబ‌ట్టి ప‌న్ను చెల్లించే మొత్తానికి రూ.70 వేలు. మొత్తం ప‌న్ను రూ.14,12,500 ( అంటే ప‌న్ను రూ.13,42,500 తో పాటు రూ.70 వేలు కలిపి) అద‌నంగా ఎడ్యుకేష‌న్‌, హెల్త్ సెస్ 4 శాతం అంటే రూ.56,500. మొత్తం చెల్లించాల్సిన ఆదాయ ప‌న్ను రూ.14,12,500 + రూ.56,500 =రూ.14,69,000.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly