ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఎంత కావాలి?

ఏ వ‌య‌సులో ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుంటే ఎంత నిధి అవ‌స‌రం అవుతుంది? ప్ర‌ణాళిక ఎలా ఉండాలి ?తెలుసుకుందాం ..

ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఎంత కావాలి?

ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ఎంత నిది అవ‌స‌ర‌మ‌వుతుంది అంటే ఒక్క మాట‌లో స‌మాదానం చెప్ప‌డం క‌ష్టం. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఏర్పాటు చేసుకునే ప్ర‌ణాళిక వేసుకునే ముందు చాలా విషయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. దీన్ని పూర్తి విశ్లేష‌ణ‌తో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం…

ముఖ్యంగా 6 ప్ర‌ధాన అంశాల‌ను ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం ప‌రిశీలించాలి. అవి…

 1. మీ ప్ర‌స్తుత వ‌య‌సు
 2. మీ భార్య లేదా భ‌ర్త వ‌య‌సు
 3. ఏ వ‌య‌సులో ప‌ద‌వీ విర‌మ‌ణ కోరుకుంటున్నారు ( 40,45,50,55,60)
 4. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం ( అది మీ ఖ‌ర్చుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుత ఖ‌ర్చులు రూ.20 వేలు, రూ.30 వేలు, రూ.50 వేలు, ల‌క్ష రూపాయ‌లు)
 5. జీవిత కాలం (60 సం, 70 సం, 80 సం, 100 సంవ‌త్స‌రాలు)
 6. అత్య‌స‌ర నిధి
  పిల్ల‌ల విద్య‌, పెళ్లి, ఇళ్లు, కారు వంటి వాటికి కేటాయించిన‌ త‌ర్వాత ప‌దవీ విర‌మ‌ణ కోసం కూడా కొంత ప‌క్క‌న పెట్టాలి. ప్రాథ‌మిక బీమా పాల‌సీలు ట‌ర్మ్, ఆరోగ్య బీమా, వ్య‌క్తిగ‌ద ప్ర‌మాద బీమా వంటివి తీసుకోవాలి.

40 ఏళ్ల వ‌య‌సులో ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుంటే…

 • ప్ర‌స్తుత వ‌య‌సు -25 సంవ‌త్స‌రాలు
 • ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు-40 సంవ‌త్స‌రాలు
 • ఇప్పుడు ఉన్న ధ‌ర‌ల‌ ప్ర‌కారం నెల‌కు రూ.30,000
 • జీవ‌న కాలం 80 సంవ‌త్స‌రాలు అనుకుంటే,
 • ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం,
 • ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌ పెట్టుబ‌డులపై వ‌చ్చే రాబ‌డి ద్ర‌వ్యోల్బ‌ణం కంటే 1 శాతం ఎక్కువ
 • ఇప్పుడు రూ.30 వేల విలువ 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత అంటే 40 ఏళ్ల‌కు రూ.72,000
 • ఈ లెక్క ప్ర‌కారం క‌నీసం ఏర్పాటు చేసుకోవాల్సిన మొత్తం రూ.2.85 కోట్లు
 • ఖ‌ర్చులు రూ.40 వేల‌కు పెరిగితే రూ.3.8 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి.
 • నెల‌కు ఖ‌ర్చులు రూ.10 వేలు పెరిగితే అద‌నంగా కోటి రూపాయ‌లు జ‌మ చేసుకోవాల్సి ఉంటుంది.

45 ఏళ్ల వ‌య‌సులో ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుంటే…

 • ప్ర‌స్తుత వ‌య‌సు 30 సంవ‌త్స‌రాలు
 • ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 45 సంవ‌త్స‌రాలు
 • ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌తో నెల‌కు అయ్యే ఖ‌ర్చు రూ.35,000
 • జీవ‌న కాలం 85 సంవ‌త్స‌రాలు అనుకుంటే
 • ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం
 • ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌ పెట్టుబ‌డులపై వ‌చ్చే రాబ‌డి ద్ర‌వ్యోల్బ‌ణం కంటే 1 శాతం ఎక్కువ
 • ఇప్పుడు రూ.35 వేల విలువ 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.84,000
 • అంటే క‌నీసం ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ఏర్పాటు చేసుకోవాల్సిన నిధి రూ.3.30 కోట్లు.
 • వ్య‌యాలు రూ.40 వేల‌కు పెరిగితే రూ.3.8 కోట్లు
 • మీ ఖ‌ర్చుల‌ను నెల‌కు మ‌రో రూ.5 వేలు పెరిగితే అద‌నంగా మ‌రో రూ.50 ల‌క్ష‌లు జ‌మ‌చేసుకోవాల్సి ఉంటుంది.

50 ఏళ్ల వ‌య‌సులో ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుంటే…

 • ప్ర‌స్తుత వ‌య‌సు 30 సంవ‌త్స‌రాలు
 • ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 50 సంవ‌త్స‌రాలు
 • ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌తో నెల‌కు ఖ‌ర్చు రూ.30 వేలు
 • జీవ‌న కాలం 85 సంవ‌త్స‌రాలు
 • ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం
 • ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌ పెట్టుబ‌డులపై వ‌చ్చే రాబ‌డి ద్ర‌వ్యోల్బ‌ణం కంటే 1 శాతం ఎక్కువ
 • ఇప్పుడు రూ.30 వేల విలువ 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.96,000
 • అంటే ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుకి రూ.3.4 కోట్లు జ‌మ‌చేసుకోవాలి.
 • ఖ‌ర్చులు రూ.50 వేల‌కు పెరిగితే రూ.5.7 కోట్లు అవ‌స‌రం అవుతాయి.

60 సంవ‌త్స‌రాల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ‌:

 • ప్ర‌స్తుత వ‌య‌సు 30 సంవ‌త్స‌రాలు
 • ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 60 సంవ‌త్స‌రాలు
 • ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల ప్ర‌కారం నెల‌కు ఖ‌ర్చు రూ.30,000
 • జీవ‌న కాలం 90 సంవ‌త్స‌రాలు
 • ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం
 • ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌ పెట్టుబ‌డులపై వ‌చ్చే రాబ‌డి ద్ర‌వ్యోల్బ‌ణం కంటే 1 శాతం ఎక్కువ
 • ఇప్పుడు రూ.30 వేల విలువ వ‌చ్చే 30 సంవ‌త్స‌రాల‌కు రూ.1,72,000
 • అంటే ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి మీ వ‌ద్ద ఉండాల్సిన క‌నీస మొత్తం రూ.5.4 కోట్లు
 • ఖ‌ర్చు ల‌క్ష రూపాయ‌ల‌కు పెరిగితే రూ.18 కోట్లు జ‌మ‌చేసుకోవాల్సి ఉంటుంది.
 • అంటే ఖ‌ర్చు రూ.50 వేలు పెరిగ‌గితే అద‌నంగా మ‌రో 12.6 కోట్లు స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.

రిటైర్‌మెంట్ కోసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన మ‌రో మూడు అంశాలు…

 • ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డేలా అద‌నంగా మ‌రో 20-30 ల‌క్ష‌ల మీ వ‌ద్ద ఉండాలి.
 • మీ భార్య మీకంటే 2-3 సంవ‌త్స‌రాల త‌క్కువ వ‌య‌సు క‌లిగి ఉన్న‌ప్పుడు, జీవ‌న‌కాలం స‌మానంగా అంచ‌నా వేసిన‌ప్పుడు అద‌నంగా మ‌రింత నిధి స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.
 • జీవ‌న కాలం 80 లేదా 85 సంవ‌త్స‌రాలుగా అంచ‌నా వేసుకున్న‌ప్పుడు అంత‌కంటే ఎక్కువ కాలం జీవించి ఉంటే మ‌రి ఖ‌ర్చులు ఉంటాయి క‌దా. అందుకే మ‌రో 20-30 ల‌క్ష‌లు అద‌నంగా ఉండాలి. దీనికోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలి.

చివ‌ర‌గా…
ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉద్యోగంలో చేరినప్ప‌టినుంచే ప్ర‌ణాళిక వేసుకుంటే అవ‌స‌ర‌మైనంత స‌మ‌కూర్చుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని ఏం కాదు. స‌రైన ప్ర‌ణాళికంతో పెట్టుబ‌డులు ప్రారంభించి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సంతోష‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly