ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు త‌మ ఏటీఎమ్ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లపై నిర్ధిష్ట ప‌రిమితి క‌లిగి ఉన్నాయి. ఇది బ్యాంకుకి, బ్యాంకుకి మారుతుంది. కార్డు ర‌కం, ఖాతా ఆధారంగా న‌గదు ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితి ఉంటుంది.

ఎస్‌బీఐ, త‌మ‌ ఏటీఎమ్ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ప‌రిధిని రూ. 40 వేల నుంచి రూ.20 వేలకు త‌గ్గించ‌నుంది. ఈ కొత్త నియ‌మాలు ఎస్‌బీఐ క్లాసిక్‌, మాస్ట్రో డెబిట్ కార్డు వినియోగ‌దారుల‌కు, అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి. ఎస్‌బీఐ వివిధ డెబిట్ కార్డుల‌కు వివిధ న‌గ‌దు విత్‌డ్రా ప‌రిమితిని విధించింది. ఎస్‌బీఐ ప్ర‌ముఖ క్లాస్లిక్ డిబిట్ కార్డు రోజువారీ ప‌రిమితి రూ. 40 వేలు.

ఎస్‌బీఐ ఇత‌ర కార్డుల‌పై విత్‌డ్రా ప‌రిమితి:

ఎస్‌బీఐ గ్లోబ‌ల్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ డెబిట్ కార్డ్ : రోజుకు రూ. 50 వేలు
ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ డెబిట్ కార్డ్ : రోజుకు రూ. 1 ల‌క్ష‌

కొన్ని అగ్ర బ్యాంకుల ఏటీఎమ్ న‌గ‌దు విత్ డ్రా వివ‌రాలు:

హెచ్‌డీఎఫ్‌సీ:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు ప్లాటిన‌మ్ చిప్ డెబిట్ కార్డుల నుంచి ఏటీఎమ్ ద్వారా రోజుకు రూ.1 ల‌క్ష విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఇత‌ర కార్డుల ప‌రిధి:

హెచ్‌డీఎఫ్‌సీ టైటానియ‌మ్ రాయ‌ల్ డెబిట్ కార్డు: రోజుకి రూ. 75 వేలు
హెచ్‌డీఎఫ్‌సీ ఈజీ షాప్ డెబిట్ కార్డు: రోజుకి రూ. 25 వేలు
హెచ్‌డీఎఫ్‌సీ రూపే ప్రీమియం డెబిట్ కార్డు: రోజుకి రూ. 25 వేలు
హెచ్‌డీఎఫ్‌సీ ఈజీ షాప్ టైటానియ‌మ్ డెబిట్ కార్డు: రోజుకి రూ. 50 వేలు.

యాక్సిస్ బ్యాంక్‌:

యాక్సిస్ బ్యాంక్ అనేక డెబిట్ కార్డులను అందిస్తుంది. రుణదాత అధికారిక వెబ్ సైట్ ప్రకారం, బర్గుండి డెబిట్ కార్డ్ రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితి రూ .3 లక్షలకు అనుమతిస్తుంది. టైటానియం ప్రైమ్‌, ప్ల‌స్ డెబిట్ కార్డులపై రూ. 50 వేల ప‌రిమితి ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్:

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం, ఈ బ్యాంకు ఖాతాదారుడు ఏ ఏటీఎమ్ కార్డు నుంచైనా రోజుకు రూ. 50 వేలు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఇత‌ర కార్డుల ప‌రిధి:

ఐసీఐసీఐ బ్యాంకు ప్రీవిలైజ్ బ్యాంకింగ్ టైటానియ‌మ్ డెబిట్ కార్డు ప‌రిమితి: రోజుకి రూ. 1 ల‌క్ష‌
ఐసీఐసీఐ బ్యాంకు స్మార్ట్ షాపింగ్ గోల్డ్ డెబిట్ కార్డు ప‌రిధి: రోజుకి రూ. 75 వేలు
ఐసీఐసీఐ బ్యాంకు షాప‌ర్ సిల్వ‌ర్ డెబిట్ కార్డు ప‌రిధి: రోజుకి రూ. 50 వేలు

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు:

పీఎన్‌బీ ప్లాటిన‌మ్‌, క్లాసిక్ కార్డుల‌కు వేరు వేరు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ప‌రిధి ఉంది. ఈ రెండింటిలోనూ రూపే, మాస్ట్రో కార్డులు అందుబాటులో ఉన్నాయి.
పీఎన్‌బీ ప్లాటిన‌మ్ కార్డు: రోజుకి రూ. 50 వేలు
పీఎన్‌బీ క్లాసిక్ కార్డు: రోజుకి రూ. 25 వేలు.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా:

ఈ బ్యాంకు రూపే క్లాసిక్ కార్డు విత్ డ్రా ప‌రిధి రోజుకి రూ. 25 వేలు

ఇత‌ర కార్డుల ప‌రిధి:

బ‌రోడా మాస్ట‌ర్ ప్లాటిన‌మ్ కార్డు: రోజుకి రూ. 50 వేలు
రూపే ప్లాటిన‌మ్ కార్డు: రోజుకి రూ. 50 వేలు
వీసా ఎల‌క్ట్రాన్‌ కార్డు: రోజుకి రూ. 25 వేలు
మాస్ట‌ర్ క్లాసిక్ కార్డు : రోజుకి రూ. 25 వేలు
వీసా ప్లాటిన‌మ్ చిప్ కార్డు: రోజుకి రూ.1 ల‌క్ష‌

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly