ఈపీఎఫ్ నుంచి ఎంత ఉప‌సంహ‌రించుకుంటే దానికి 10 రెట్లు నష్టపోతారు..

మూడు నెలల జీతం లేదా పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం బ్యాలెన్స్, ఇందులో ఏది తక్కువ ఉంటే దానిని ఉపసంహరించుకోవచ్చు

ఈపీఎఫ్ నుంచి ఎంత  ఉప‌సంహ‌రించుకుంటే దానికి 10 రెట్లు నష్టపోతారు..

కోవిడ్ -19 సంక్షోభం కారణంగా నగదు సంక్షోభం నుంచి బయటపడటానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి ఉద్యోగులను మార్చి 28 న ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించిన 15 రోజుల్లోనే ఈపీఎఫ్ సంస్థ 3,31,000 క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి, రూ. 946.49 కోట్లు పంపిణీ చేసింది. అంతేకాకుండా, ఏప్రిల్ 17 నాటికి మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులకు సంబంధించిన 40,826 మంది సభ్యులు రూ. 481.63 కోట్లు ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.,

మీరు మూడు నెలల జీతం (ప్రాథమిక వేతనం, డీఏ) లేదా పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం బ్యాలెన్స్, ఇందులో ఏది తక్కువ ఉంటే దానిని ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసిన ఈపీఎఫ్ఓ ​​సభ్యుడు సరాసరి రూ. 28,500 తీసుకున్నాడు, అదే విధంగా మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్ సభ్యుడు రూ. 1.18 లక్షలు తీసుకున్నాడు. అయితే, ఈ ఉపసంహరణ మీ పదవీ విరమణ కార్పస్‌ను బాగా తగ్గిస్తుంది.

రిటైర్మెంట్ కార్పస్‌పై ప్రభావం

వేతనజీవులు వారి నెలవారీ జీతంలో 12 శాతం (ప్రాథమిక వేతనం, డీఏ) తప్పనిసరిగా ఈపీఎఫ్ కు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యజమాని కూడా అదే మొత్తాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈపీఎఫ్ కార్పస్ మీ పదవీ విరమణ కిట్టిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటుంది, దీనిని సంవత్సరాల పాటు అలా వదిలేస్తే, కంపౌండింగ్ కారణంగా పదవీ విరమణ సమయంలో మీరు ఊహించని పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు.

కెరీర్ మధ్యలో చేసే ఒక చిన్న ఉపసంహరణ కూడా రిటైర్మెంట్ కార్పస్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బ్యాక్-ఆఫ్-ఎన్వలప్ లెక్కల ప్రకారం, మీ పదవీ విరమణ 30 సంవత్సరాలలో ఉందనుకుంద్దాం, ఒకవేళ మీరు ఇప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. ఒక లక్ష ఉపసంహరించుకున్నట్లైతే, మీ రిటైర్మెంట్ కార్పస్ సుమారు రూ. 11.55 లక్షలు తగ్గుతుంది (ఒకవేళ ఈపీఎఫ్ సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును కొనసాగించినట్లతే). ఉపసంహరణ మొత్తం ఎంత పెద్దది అయితే, మీ కార్పస్‌ అంత ఎక్కువగా తగ్గిపోతుంది. ఆంటే ఒకవేళ మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. 3 లక్షలు ఉపసంహరించుకుంటే, కార్పస్ రూ. 34.67 లక్షల వరకు తగ్గుతుంది.

సాధారణంగా, ప్రజలు పెట్టుబడి పెట్టే ఏకైక పదవీ విరమణ సాధనం ఈపీఎఫ్, కావున వీలైనంత కాలం దానిని కదిలించకుండా ఉంచడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly