వివిధ పెట్టుబడి పథకాల్లో నామినేషన్లు ఎలా పనిచేస్తాయి?

మరణం విషయంలో ఆస్తులను పొందటానికి నామినేషన్ అనేది చాలా ప్రభావవంతమైన సాధనం

వివిధ పెట్టుబడి పథకాల్లో నామినేషన్లు ఎలా పనిచేస్తాయి?

నామినీ అనే వారు యజమాని మరణం తరువాత వారి ఆస్తులపై చట్టపరమైన హక్కులను పొందుతారు. ఒకవేళ మరణించిన వ్యక్తి వీలునామాను రాస్తే, అతనికి సంబంధించిన ఆస్తులను, ఆదాయాన్ని నిబంధనల ప్రకారం వీలునామాలో తెలిపిన వ్యక్తికి చెల్లిస్తారు. ఒకవేళ వీలునామా రాయకపోతే, ఆస్తుల పంపిణీ మరణించినవారికి వర్తించే వ్యక్తిగత చట్టం ద్వారా నిర్వహించబడుతుంది.

అయినప్పటికీ, మరణం విషయంలో ఆస్తులను పొందటానికి నామినేషన్ అనేది చాలా ప్రభావవంతమైన సాధనం. ఒకవేళ నామినేషన్ లేకపోతే, చట్టపరమైన వారసులు తమను చట్టబద్దమైన వారసులుగా నిరూపించుకోవటానికి సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.

జీవిత బీమా పాలసీలు :

పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో తెలుపుతూ బహుళ నామినీలను నమోదు చేయవచ్చు. ఒకవేళ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి నామినీగా నమోదు అయితే, బీమా చేసిన వ్యక్తికి నామినీపై ఉన్న ఆసక్తిని నిరూపించుకోవాలి.

బ్యాంకు ఖాతాలు :

బ్యాంకు ఖాతాలలో ఒక వ్యక్తిని మాత్రమే నామినీగా చేర్చవచ్చు. ఏదేమైనా, ఉమ్మడి అనుమతితో ఉమ్మడిగా ఆపరేట్ చేసే లాకర్ ఖాతాలలో ఒకటి కంటే ఎక్కువ మందిని (ఇద్దరు వ్యక్తుల వరకు) నామినీలుగా అనుమతిస్తారు. అలాగే ఒకే బ్యాంకు ఖాతాలో ఉన్న ఎఫ్‌డీ, సేవింగ్స్, ఆర్‌డీ ఖాతాలకు వేర్వేరు నామినీలను కలిగి ఉండవచ్చు.

షేర్లు :

ఒకవేళ పెట్టుబడిదారుడు షేర్లను కలిగి ఉన్నట్లయితే, డిపాజిటరీ పార్టిసిపెంట్ లెవెల్ లో నామినేషన్ నమోదు చేయాలి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు :

మ్యూచువల్ ఫండ్లలో ముగ్గురు వ్యక్తుల వరకు నామినేట్ చేయవచ్చు. ఒకే ఫోలియో కింద అన్ని పెట్టుబడులకు (వేర్వేరు పథకాలు ఉన్నప్పటికీ) ఒకే నామినేషన్ కలిగి ఉంటాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ :

ఫారం ఈ, ఫారం ఎఫ్ లను వర్తింపజేయడం ద్వారా నామినేషన్ చేయవచ్చు. మైనర్ ఖాతా విషయంలో నామినేషన్ చేయలేము. ప్రతి నామినీ వాటా స్పెసిఫికేషన్‌తో పాటు బహుళ నామినేషన్లను పీపీఎఫ్ అనుమతిస్తుంది.

గమనించవలసిన పాయింట్ :

సంస్థలు తెలిపిన ప్రక్రియను అనుసరించడం ద్వారా నామినేషన్లను మార్చుకోవచ్చు. మైనర్ కూడా నామినీ కావచ్చు, అయితే గార్డియన్ వివరాలు నామినేషన్ ఫారంలో పేర్కొనాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly