పీపీఎఫ్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే మొత్తాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

చందాదారుడు మ‌ర‌ణించాక‌ పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన అద‌న‌పు డిపాజిట్ల‌పై ఎలాంటి వ‌డ్డీ రాదు.

పీపీఎఫ్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే మొత్తాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

పీపీఎఫ్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే ఖాతాలో ఉన్న‌ న‌గ‌దు కోసం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఏ ఫారం నింపాలి? నామినికి వార‌సుడికి ఉన్న తేడా ఏంటి? పీపీఎఫ్ ఖాతాకు నామినీని ఎలా ఎంచుకోవాలి? తెలుసుకుందాం

పీపీఎఫ్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే…
పీపీఎఫ్ చందాదారుడు మ‌ర‌ణిస్తే పీపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ నామినీకి లేదా వార‌సుడికి అంద‌జేస్తారు. ఏవైనా రుణాలు, వాటిపై వ‌డ్డీలు పీపీఎఫ్ నుంచి తీసుకొని చెల్లించ‌న‌ట్ల‌యితే, వాటిని మిన‌హాయించి మిగ‌తాది ఇస్తారు.

ఖాతాదారుడు మ‌ర‌ణించాక విత్‌డ్రా చేయ‌క‌పోతే…

  • చందాదారుడు మ‌ర‌ణించాక‌ పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన అద‌న‌పు డిపాజిట్ల‌పై ఎలాంటి వ‌డ్డీ రాదు.
  • పీపీఎఫ్ ఖాతా గ‌డువును పొడ‌గించుకునేందుకు వీలుండ‌దు. ఇత‌రుల‌కు బ‌దీలీ చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు. అదేవిధంగా పాక్షిక ఉప‌సంహ‌ర‌ణలు చేసుకోరాదు.
  • అయితే ఖాతాలో ఉన్న‌ డ‌బ్బుపై వ‌డ్డీ ల‌భిస్తుంది. దీనిపై ప‌న్ను ఉండ‌దు.
  • ఖాతాదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత నామినీ ఖాతాను కొన‌సాగించ‌డం రిస్క్‌తో కూడుకున్న ప‌ని ఎందుకంటే నామినీ మ‌రొక నామినీని ఎంచుకునేందుకు వీలుండ‌దు.
    ఏ సంద‌ర్భాల‌లో క్లెయిమ్ చేసుకోవ‌చ్చు
  • నామినేష‌న్ స‌దుపాయం ఉన్న‌ప్పుడు, నామినీ జీవించి ఉన్న‌ప్పుడు
  • చందాదారుడు, నామినీ మ‌ర‌ణించిన‌ప్పుడు… మిగ‌తా నామినీలు, నామినీ మ‌ర‌ణించిన‌ట్లు దృవీక‌ర‌ణ ప‌త్రాన్నిఅంద‌జేయాలి.
  • నామినేష‌న్ లేన‌ప్పుడు లీగ‌ల్ ఎవిడెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.
  • నామినేష‌న్ లేన‌ప్పుడు ఖాతాలో క్రెడిట్ ల‌క్ష రూపాయ‌ల కంటే త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవ‌చ్చు.

ఉమ్మ‌డిగా నామినీలు ఉన్న‌ప్పుడు , వారిని ఉమ్మ‌డి ఖాతాదారులుగా ప‌రిగ‌ణిస్తారు. ఖాతాను మూసివేసేందుకు ఉమ్మ‌డిగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తీ నామిని వారి గుర్తింపు ప‌త్రాల‌ను అధికారుల‌కు ఇవ్వాలి. ఫార్మాలిటీలు పూర్త‌యిన త‌ర్వాత అంద‌రు నామినీల‌కు క‌లిపి ఒక చెక్కు ఇస్తారు. అంద‌రు క‌లిపి ఉమ్మ‌డి ఖాతా తీసుకునేంత‌వ‌ర‌కు చెక్కును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండ‌దు. ఒక్కో నామినీకి త‌గినంత శాతం ప్ర‌యోజ‌నాలు అందుతాయి. అయితే ఫారంలో దీనికోసం ప్ర‌త్యేక‌మైన వివ‌రాలు ఏం ఉండ‌వు. దీంతో చాలామంది త‌గిన శాతాన్ని ఎంచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు.

నామినీ లేక‌పోతే ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చ‌ట్ట‌ప్ర‌కారం వార‌సుడికి అంద‌జేస్తారు. అయితే దీనికివార‌స‌త్వ‌పు స‌ర్టిఫికెట్‌ స‌మ‌ర్పించాలి. ఈ స‌ర్టిఫికెట్‌ను పొందేందుకు చాలా స‌మ‌యం, డ‌బ్బు, శ్ర‌మ అవ‌స‌రం అవుతుంది. ఫారం జీ తో పాటు న‌ష్ట‌ప‌రిహార లేఖ‌, అఫిడ‌విల్, అఫిడ‌విట్ డిస్‌క్లెయిమ‌ర్ లెట‌ర్, డెత్ స‌ర్టిఫికెట్ వంటివి స‌మ‌ర్పిస్తే ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌క‌కు వార‌సుడికి ఇస్తారు.

పీపీఎఫ్ ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే, మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఫారం జీ తో పాటు ఖ‌తాదారుడి పాస్‌బుక్‌, డెత్ స‌ర్టిఫికెట్ ఇవ్వాలి. నామినీ లేదా నామినీలు ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారి డెత్‌స‌ర్టిఫికెట్‌ను కూడా మిగ‌తావారు అంద‌జేయాలి. అస‌లు నామినీ లేకపోతే వార‌స‌త్వ స‌ర్టిఫికెట్, లెట‌ర్ ఆఫ్ అడ్మినిస్ర్టేష‌న్ లేదా విల్లు వంటివి స‌మ‌ర్పించాలి. ఒక‌సారి అప్లికేష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత ప్రాసెస్ చేసేందుకు నెల‌రోజుల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తారు. పీఎఫ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ జ‌రిగేందుకు 30 నుంచి 90 రోజుల వ‌ర‌కు స‌మ‌యం తీసుకుంటారు.

నామినీ - వార‌సుడికి తేడా ఏంటి?
చ‌ట్ట ప్ర‌కారం నామినీ అంటే పెట్టుబ‌డుల‌కు య‌జ‌మాని కాడు. పెట్టుబ‌డుదారుడు అత‌డికి న‌మ్మ‌క‌స్తుడైన వారినే నామినీగా ఎంచుకుంటారు. పెట్టుబ‌డుదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత ఆస్తుల‌ను స్వీక‌రించి విల్లులో రాసిన‌ట్లుగా వార‌సుల‌కు అంద‌జేయ‌డం, విల్లు లేక‌పోతే చ‌ట్టం ప్ర‌కారం వార‌సుల‌కు అందించ‌డం వారి బాధ్యత‌. దేశంలో మ‌తాల‌కు అనుగుణంగా చ‌ట్టాలు ఉన్నాయి. హిందువుల‌కు, ముస్లింల‌కు వేర్వేరు చ‌ట్టాలు రూపొందించారు.

నామినీలు లేక‌పోతే వార‌సులు అన్ని రుజువులు అంటే ఖాతాదారుడితో ఉన్న బందుత్వం వంటి అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాలి. నామినీ ఉంటే మాత్రం డ‌బ్బును వారు బ‌య‌ట‌కు తీసుకొస్తారు. ఆ త‌ర్వాత విల్లులో ఉన్న ప్ర‌కారం వార‌సుల‌కు అంద‌జేస్తారు. విల్లులేక‌పోతే చ‌ట్ట‌ప్ర‌కారం ఎవ‌రికి ఎంత చెందాలో వారికి అందిస్తారు. పీపీఎఫ్ ఖాతాకు నామినీని నియ‌మించేందుకు ఫారం E పూర్తిచేయాలి. నామినీని మార్చేంద‌కు ఫారం F ను స‌మ‌ర్పించాలి.

పీపీఎఫ్ నామినేష‌న్‌లో ఒక‌రి కంటే ఎక్కువ మంది నామినీల‌ను ఎంచుకోవ‌చ్చు. ఎవ‌రికి ఎంత చెందాలో స్ప‌ష్టంగా అప్పుడే తెలియ‌జేయాలి. ఒక‌వేళ అలా రాయ‌క‌పోతే చందాదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత‌ ఉన్న దాంట్లో అంద‌రికీ స‌మానంగా వెళ్తుంది. ఖాతాదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత నామినీ లేదా నామినీలు ఎవ‌రైనా అందుబాటులో లేక‌పోయినా, లేదా ఖాతాదారుడి డ‌బ్బును తీసుకునేంద‌కు ఆస‌క్తి లేక‌పోయినా వారికి ఎంత చెందుతుందో అంతే ఖాతాలో ఉంచి మిగ‌తా నామినీల‌కు వారి వాటా చెల్లిస్తారు. ఇలాంటి సంద‌ర్భంలో పాస్‌బుక్ అవ‌స‌రం ఉంటుంది.

మ‌ర‌ణించిన ఖాతాదారుడికి మైన‌ర్ పిల్ల‌లు ఉంటే…
మైన‌ర్‌ పిల్ల‌ల సంర‌క్ష‌కుడు లేదా తండ్రి మ‌ర‌ణించిన‌ప్పుడు మైన‌కి ఉన్న సంబంధం, పీపీఎఫ్ ఖాతా మైన‌ర్ పేరుతో తెరిస్తే దానిని మూసివేసి కొత్త ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంర‌క్ష‌కుడు మ‌ర‌ణిస్తే య‌జ‌మాని మైన‌ర్ అవుతాడు కావున మ‌రో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. సెక్ష‌న్ 8 ప్ర‌కారం ఖాతాలో ఉన్న మొత్తాన్ని మైన‌ర్‌కు అందించేందుకు వీలుండ‌దు. కేవ‌లం చందాదారుడి పేరుతో ఖాతా ఉంటేనే ఆ డ‌బ్బును చెల్లించేందుకు వీలుంటుంది. ఒకవేళ సంర‌క్ష‌కుడు మ‌ర‌ణించినా మైన‌ర్ పేరుతో ఖాతాను యాక్టివ్‌గా కొన‌సాగిస్తే మ‌రో ఖాతాను ప్రారంభించే అవ‌స‌రం లేదు. మ‌రో సంర‌క్ష‌కుడు లేదా కోర్టు ఏర్పాటు చేసే సంర‌క్ష‌కుడు ఈ ఖాతాను పిల్ల‌ల పేరుతో ప్రారంభించ‌వ‌చ్చు. దీనికి గార్డియ‌న్‌షిప్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం ఉంటుంది.

మైన‌ర్ మ‌ర‌ణిస్తే…
మైన‌ర్ పేరుతో ఖాతా ఉన్న‌ప్పుడు మైన‌ర్ మ‌ర‌ణిస్తే బ్యాలెన్స్ సంర‌క్ష‌కుడికి తిరిగి ఇవ్వ‌రు . పీపీఎఫ్ యాక్ట్ సెక్ష‌న్ 8 ప్ర‌కారం, చ‌ట్ట‌ప్ర‌కారం వార‌సుల‌కు ఆ న‌గ‌దు వెళ్తుంది.

ఫారం జీ
నామినీ లేదా వార‌సుడు ఖాతాలో ఉన్న మొత్తాన్ని తీసుకొని మూసివేయ‌వ‌చ్చు . పాక్షికంగా తీసుకునేందుకు వీలుండ‌దు. మొత్తం ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. చందాదారుడు మ‌ర‌ణిస్తే నామినీకి బ్యాలెన్స్ మొత్తం తిరిగి అప్ప‌గించేంత వ‌ర‌కు పీపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ పై వ‌డ్డీ కొన‌సాగుతుంది. పీపీఎఫ్ మొత్తం ఒక‌రి నుంచి మ‌రొక‌రికి ట్రాన్స్‌ఫ‌ర్ కాదు. నామినీ త‌మ పేరుతో ఖాతాను కొన‌సాగించేందుకు వీలుండ‌దు.

ఫారం జీ అనేది పీపీఎఫ్ క్లెయిమ్ చేసుకునేందుకు త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రం. ఫారం జీ తో పాటు త‌గిన డాక్యుమెంట్ల‌ను కూడా అందించాలి. క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు 30 రోజుల నుంచి 90 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. పీపీఎఫ్ చందాదారుడు మ‌ర‌ణిస్తే నామినీ లేదా వార‌సుడు రుణంపై త‌గిన వ‌డ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly